మల్లేశం మూవీ రివ్యూ
మల్లేశం మూవీ రివ్యూ బ్యానర్: శ్రీ అధికారి బ్రదర్స్ నటీనటులు: ప్రియదర్శి, అనన్య నాగల్ల, చక్రపాణి ఆనంద, జగదీశ్ ప్రతాప్, ఝాన్సీ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: మార్క్ [more]
మల్లేశం మూవీ రివ్యూ బ్యానర్: శ్రీ అధికారి బ్రదర్స్ నటీనటులు: ప్రియదర్శి, అనన్య నాగల్ల, చక్రపాణి ఆనంద, జగదీశ్ ప్రతాప్, ఝాన్సీ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: మార్క్ [more]
మల్లేశం మూవీ రివ్యూ
బ్యానర్: శ్రీ అధికారి బ్రదర్స్
నటీనటులు: ప్రియదర్శి, అనన్య నాగల్ల, చక్రపాణి ఆనంద, జగదీశ్ ప్రతాప్, ఝాన్సీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: మార్క్ కే రాబిన్
సినిమాటోగ్రఫీ: బాలు శాండిల్య
ప్రొడ్యూసర్: వెంకట్ సిద్ధారెడ్డి
దర్శకత్వం: రాజ్ రాచకొండ
పెళ్లి చూపులు సినిమాలో ‘నా చావు నేను చస్తా’ అనే డైలాగు తోనూ, ఎన్టీఆర్ జై లవ కుశలో రాశి ఖన్నాని పెళ్లి చేసుకోవడానికి వచ్చే బాఫున్ పెళ్లి కొడుకు పాత్రలోనూ కడుపుబ్బా నవ్వించిన ప్రియదర్శికి.. దాదాపు స్టార్ హీరోల సినిమాల్లో మంచి మంచి అవకాశాలు -వచ్చాయి. హీరోల ఫ్రెండ్స్ కేరెక్టర్స్ లోను ప్రియదర్శి కామెడీ పండించేవాడు. ఇక ప్రియా దర్శి కున్న క్రేజ్ తో యాడ్స్ లోను మంచి అవకాశాలు వచ్చాయి. అయితే కమెడియన్స్ హీరోలుగా మరిపోయి హీరోయిజం చూపిస్తున్న టైం లో పియదర్శి కూడా హీరోగా మారి ఓ బయోపిక్ లో నటించాడు. రాజ్ రాచకొండ అనే దర్శకుడు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేత కార్మికుల కోసం ఆసు యంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం కథను సినిమాగా మలిచాడు. మరి పాపులర్ అయినా వ్యక్తుల బియోపిక్స్ ని చూపించిన ఆ వ్యక్తుల గురించి అంతో ఇంతో ప్రేక్షకులకు తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి చింతకింది మల్లేశం వ్యక్తుల కథలను ప్రత్యేకంగా ఇలాంటి బయోపిక్ ల ద్వారానే తెలుసుకోవాలి. చేనేత కార్మికుల కు బాసటగా నిలిచిన చింతకింది మల్లేశం పాత్రలో ప్రియదర్శి అద్భుతమంటూ ఇప్పటికే మల్లేశం ట్రైలర్ విడుదల చేసినప్పుడు చూసాం. మరి ఇపుడు పూర్తి కథతో ఈ శుక్రవారం మల్లేశం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ:
చేనేత వృత్తిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తారు. చాలా కుటుంబాలు శ్రమకు తగిన ఫలితం లభించకపోవడం అప్పుల ఊబిలో కూరుకుపోతాయి. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. చింతకింద మల్లేశం (ప్రియదర్శి)ది దిగువ మధ్యతరగతి కుటుంబం. మల్లేశం తల్లితండ్రులది చేనేతే ఉపాధి. ఎంతగా కష్టపడినా… చలి చాలని జీతాలే. ఆ తక్కువ జీతంతోనే జీవితం సాగిస్తుండాలి. కుటుంబంలోని ఆర్థిక కారణాల వల్ల ఆరో తరగతిలోనే మల్లేశం చదువు ఆగిపోతుంది. అయితే మల్లేశం తల్లి(ఝాన్సీ) చీర తయారు చేయడానికి పడుతున్న కష్టం చూసి తల్లడిల్లిపోతాడు మల్లేశం. అమ్మకి కష్టం కలగకుండా, సులభంగా నేత నేసేలా ఓ యంత్రం కనుక్కోవాలనుకుంటాడు. అప్పులు చేసి మరీ కావాల్సిన సామగ్రిని కొనుగోలు చేస్తాడు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా అనుకున్న గమ్యం చేరుకోలేకపోతాడు. ఈ ప్రయాణంలో ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు. ఆఖరికి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో కూడా మాటలు పడాల్సిన పరిస్థితి. మారి ఎన్ని అప్పులు చేసిన.. మల్లేశం ఆ యంత్రాన్ని కనుక్కోగలిగాడా? అసలు మల్లేశం తన లక్ష్యాన్ని చేరుకోగలిగాడా? మల్లేశం ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? మల్లేశం ని సూటి పోటీ మాటల్తో వేధించిన వారు మలేశం ని ఎలా పొగడ్తలతో ముంచెత్తారు? అనేది మిగతా కథ.
నటీనటులు నటన:
ఎప్పుడూ కామెడీతో మెప్పించే ప్రియదర్శి.. స్పైడర్ మూవీ లో మహేష్ ఫ్రెండ్ గా సీరియస్ నెస్ పాత్రలోనూ మెప్పించాడు. ఇక మల్లేశం సినిమాలో మల్లేశంగా ప్రియదర్శి ఎంపికే కాదు… అతని నటనా ఆశ్చర్యపరుస్తుంది. నవ్వులు పంచే ప్రియదర్శిలో ఇంత టాలెంట్, లోతైన నటుడున్నాడా… అనిపిస్తుంది. అంత అద్భుతమైన నటనతో ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ అనన్య అందం మాత్రమే కాదు… నటన కూడా చాల నేచురల్ గా ఐపిస్తుంది. ప్రియదర్శి – అనన్యల మధ్యన భార్యాభర్తల అన్యోన్యతని చాలా బాగా చూపించారు. ఇక ప్రముఖ యాంకర్ ఝాన్సీకి చాలా కాలం తరవాత గుర్తుండిపోయే పాత్ర పడింది. మల్లేశం స్నేహితులుగా నటించిన ఇద్దరూ తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు.
విశ్లేషణ:
చాలా బయోపిక్ లకు కమర్షియల్ హంగులను జోడించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాల్లో ఆ బయోపిక్ లు బోల్తాలు పడిన సందర్భాలు ఉన్నాయి. అందులో రీసెంట్ గా వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలే ప్రత్యక్ష ఉదాహరణలు. అయితే కమర్షియల్ హంగులకు దూరంగా ఈ మల్లేశం బయోపిక్‌ని వాస్తవికతకు చాలా తగ్గరగా చూపించాడు దర్శకుడు రాజ్. మల్లేశం సినిమాను చాలా వరకూ రియల్ లొకేషన్లలో చిత్రీకరించడం వల్ల సహజత్వం ప్రతిఫలించింది. మల్లేశం బాల్యం, యవ్వనం, పెళ్లి.. ఇవన్నీ సరదాగానే సాగిపోతాయి. ఎప్పుడైతే ఆసు యంత్రం కనుక్కోవాలన్న తాపత్రయం మల్లేశంలో పుడుతుందో అప్పుడు కథలో సీరియస్‌నెస్ వస్తుంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, బాష, యాసలను గొప్పగా చూపించారు. మేకప్ మందాలు.. పిచ్చి గంతులు.. వెకిలి కామెడీలు లేకుండా చాలా సహజంగా కృత్రిమంగా కథను అల్లి మల్లేశం కథలో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయ్యేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండ్ హాఫ్ లో ఆసు యంత్రంపై మల్లేశం చేసే పోరాటమే కనిపిస్తుంది. ప్రతిసారీ ప్రయత్నించడం, ఓడిపోవడం, మళ్లీ ప్రయత్నానికి పూనుకోవడం, క్లైమాక్స్ సీన్స్ వరకూ ఇదే తంతు. మల్లేశం చివరికి ఆసు యంత్రాన్ని కనుక్కుంటాడన్న సంగతి సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. అయినా ఓ సాధారణ మామూలు జీవితాన్నే తన కథకు స్క్రీన్ ప్లేగా మలిచి మ్యాజిక్ చేశాడు దర్శకుడు. అయితే స్లో నెరేషన్‌తో పాటు ఎమోషనల్ జర్నీ సాఫీగా సాగించడంలో అక్కడక్కడా గతుకులు కనిపిస్తూ ఉంటాయి. చివరిగా ఓ స్ఫూర్తివంతమైన కథని చెప్పాలనుకున్న దర్శక నిర్మాతల ప్రయత్నం చాలా గొప్పది. వారిని అభినందించకుండా ఉండలేం.
మార్క్ కె రాబిన్ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచింది.నేపధ్య సంగీతంతో ప్రేక్షకులను మైమరపింప చేసాడు. బాలు శాండిల్య కెమెరా జిముక్కులతో పల్లెటూరి మట్టి సువాసనల్ని ప్రేక్షకుడు రుచి చూసేటట్లు చేశారు. తెలంగాణ పల్లె అందాల్ని పట్టి చూపించింది. ఎడిటింగ్ లో మాత్రం చిన్న చిన్న లోపాలున్నాయి. సినిమా నిడివి కాస్త తాగించి ఉంటె.. ఎడిటింగ్ పరంగాను మల్లేశం కు ప్లస్ అయ్యేది. నిర్మాణ విలువలు బావున్నాయి.