Mon Dec 23 2024 03:24:33 GMT+0000 (Coordinated Universal Time)
మూవీ రివ్యూ: గాడ్ ఫాదర్ రివ్యూ..!
దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా మలయాళ లూసిఫర్ సినిమాకు తెలుగు రీమేక్ గా రూపొందింది.
మెగా స్టార్ చిరంజీవి.. ఆయన స్టార్డమ్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా టాలీవుడ్ కు బాస్ ను తానే అని రుజువు చేసుకున్నారు. రీఎంట్రీ తర్వాత కూడా తన జోరును చూపిస్తూ వస్తున్నాడు. అయితే ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆయన మార్కెట్ దెబ్బతినిందని.. రీమేక్ సినిమా చేస్తున్న చిరంజీవిని వెండితెరపై జనాలు చూస్తారా అనే కథనాలు కూడా ప్రచారం అయ్యాయి. ఇక ఈరోజు 'గాడ్ ఫాదర్' మూవీ విడుదలైంది. అడ్వాన్స్ బుకింగ్ భారీగానే సాగింది.. ఇక థియేటర్ లో బొమ్మ పడింది. అప్పుడు మొదలైంది మాస్ మేనియా.....
దసరా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైంది. ఇక ఈ సినిమా మలయాళ లూసిఫర్ సినిమాకు తెలుగు రీమేక్ గా రూపొందింది. దర్శకుడు మోహన్ రాజా కూడా లూసిఫర్ కంటే.. గాడ్ ఫాదర్ మరింత బెటర్‌గా ఉంటుందంటూ చెబుతూ వచ్చారు. అనుకున్నట్లుగానే అభిమానులకు కావాల్సిన వినోదాన్ని అందించారు.
కథ: సినిమా కథను దాదాపుగా ట్రైలర్ లోనే చెప్పేసింది చిత్ర బృందం. ఓ పార్టీకి పెద్దగా, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చనిపోతాడు. ఆ ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన పార్టీలో ఉన్న వ్యక్తులు, కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎలాంటి ప్లాన్ లు రచించారు.. పార్టీలో ఎంతో పవర్ ఫుల్ అయిన బ్రహ్మ(చిరంజీవి) ముఖ్యమంత్రి పదవిలో ఎవరిని కూర్చోబెట్టారు.. లేక తానే కూర్చున్నాడా.. అనేది సినిమా చూస్తే మీకే తెలుస్తుంది.
కథనం: సినిమా ఫస్ట్ హాఫ్ మంచి పేస్ తో సాగుతూ వెళుతుంది. ఎప్పుడూ చూడని చిరంజీవిని ఈ సినిమాలో దర్శకుడు మోహన్ రాజా మనకు చూపిస్తాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం మెగాస్టార్ హీరోయిజంతో సాగిపోతుంది. ఇంటర్వెల్ దగ్గర చిన్న సస్పెన్స్ ను క్యారీ చేసి ముందుకు తీసుకువెళ్ళాడు దర్శకుడు. ఆ తర్వాత సెకండాఫ్ లో సెంటిమెంట్ సీన్స్, ట్విస్ట్స్ రివీల్ అవ్వడం, సల్మాన్ ఖాన్ రావడం.. ఇలా క్లైమాక్స్ కు చేరుకొంటుంది.
విశ్లేషణ: అఖండ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన మ్యూజిక్ ఆ సినిమాకు ఎంత ప్లస్ అయ్యిందో.. ఈ సినిమాకు కూడా తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదుర్స్ అనిపించేలా చేశాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయాల్సినప్పుడల్లా.. మ్యూజిక్ తో రచ్చ చేశాడు. సినిమా అయిపోయాక వచ్చిన మార్ మార్ కూడా అభిమానుల్లో మంచి జోష్ ను నింపింది.
మెగాస్టార్ చిరంజీవి తర్వాత సినిమాలో చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ సత్యదేవ్ ది.. జైదేవ్ క్యారెక్టర్ లో సత్యదేవ్ సూపర్ గా చేశాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివెరీ చాలా బాగుంటుంది. కొన్ని సీన్లలో సత్యదేవ్ డైలాగ్స్ మంచి ఇంపాక్ట్ చూపించాయి. ఇక సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ దగ్గర పాట లాంటివి లేకుండా ఉండి ఉంటే సినిమాకు చాలా ప్లస్ అయ్యి ఉండేది. సల్మాన్ ఖాన్ కేమియో కూడా బాగా ఎంటర్టైన్ చేసింది. సత్య ప్రియగా నయనతార, సునీల్, బ్రహ్మాజీ.. తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కెమెరా పనితనం, ఎడిటింగ్ బాగుంది. సెకండాఫ్ మీద ఇంకొంచెం దృష్టి పెట్టి ఉండి ఉంటే.. సినిమాకు మరింత ప్లస్ అయ్యుండేది.
ప్లస్ పాయింట్స్:
మెగాస్టార్ చిరంజీవి
ఫస్ట్ హాఫ్
బ్యాగ్రౌండ్ మ్యూజిక్
స్క్రీన్ ప్లే
ఫైట్స్
మైనస్ పాయింట్స్:
సెకండాఫ్ లో కొన్ని సీన్లు
ప్రీ క్లైమాక్స్
ఓవరాల్ గా మెగా లవర్స్ మాత్రమే కాకుండా మూవీ లవర్స్ కూడా సినిమాను ఎంజాయ్ చేస్తారు.
తెలుగు పోస్ట్ రేటింగ్: 3/5
Next Story