నాంది మూవీ రివ్యూ
నాంది మూవీ రివ్యూనటీనటులు: అల్లరి నరేష్, వరలక్ష్మి శరత్ కుమార్, నవమి, వినయ్ వర్మ, హరీష్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్ తతదితరులుసంగీతం: శ్రీచరణ్ పాకాలసినిమాటోగ్రఫీ: సిద్ఎడిటింగ్: చోట [more]
నాంది మూవీ రివ్యూనటీనటులు: అల్లరి నరేష్, వరలక్ష్మి శరత్ కుమార్, నవమి, వినయ్ వర్మ, హరీష్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్ తతదితరులుసంగీతం: శ్రీచరణ్ పాకాలసినిమాటోగ్రఫీ: సిద్ఎడిటింగ్: చోట [more]
నాంది మూవీ రివ్యూ
నటీనటులు: అల్లరి నరేష్, వరలక్ష్మి శరత్ కుమార్, నవమి, వినయ్ వర్మ, హరీష్, ప్రవీణ్, ప్రియదర్శి, దేవీప్రసాద్ తతదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: సిద్
ఎడిటింగ్: చోట కె ప్రసాద్
డైలాగ్స్: అబ్బూరి రవి
నిర్మాత: సతీశ్ వేగేశ్న
స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విజయ్ కనకమేడల
అల్లరి నరేష్ అంటే కామెడీకి కేరాఫ్ అడ్రెస్స్. కామెడీ సినిమాలతోనే హీరోగా ఎదిగాడు, తనని హీరోగా నిలబెట్టిన కామెడీనే అల్లరి నరేష్ ని వెనక్కి నెట్టేసింది. మధ్య మధ్యలో గమ్యం లాంటి సినిమాలు చేసినా.. అల్లరి నరేష్ పూర్తిగా కామెడీ మాయలోనే మునిగిపోయి. చి-వరికి అందులో నుండి బయటికి రాలేక రాలేక కొట్టుమిట్టాడాడు. ఆఖరికి మహేష్ మహర్షి సినిమాలో ఓ ఫ్రెండ్ కేరెక్టర్ కూడా చేసాడు. అందులో నటనకు ఫుల్ మర్క్స్ -పడినా.. నరేష్ మాత్రం తన కలను వదల్లేదు. విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడితో కొత్తగా నాంది అనే సీరియస్ కథతో సినిమా చేసాడు. మరి ప్లాప్స్ లో కొట్టుకుపోతున్న అల్లరి నరేష్ కి నాంది సినిమా ఎమన్నా హెల్ప్ చేసిందా.. అల్లరి సినిమా ప్రయాణానినికి నాంది సినిమా నాంది అవుతుందా అనేది సమీక్షలో చూద్దాం.
కథ:
సూర్య ప్రకాష్ (అల్లరి నరేష్) ఒక మధ్య తరగతి యువకుడు. మిడిల్ క్లాస్ లో పుట్టినా బాగా చదువుకుని సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులతో అలాగే తన స్నేహితుడితో కలిసి సంతోషంగా జీవితాన్ని సాగిస్తున్న సూర్య ప్రకాష్ కి
మీనాక్షి(నవమి) అనే అమ్మాయితో పెళ్లి కూడా కుదిరిపోతుంది. అంతా హ్యాపీ గా ఉంది అనుకున్న టైం లో సూర్య ప్రకాష్ రాజగోపాల్ అనే లాయర్ హత్య కేసులో చిక్కుకుంటాడు. చేయని నేరానికి సూర్య ప్రకాష్ జైలులో మగ్గాల్సి వస్తుంది. ఐదేళ్లకు పైగా జైలు జీవితం గడిపి ఇక తాను బయటికి వస్తానన్న ఆశ పూర్తిగా కోల్పోతాడు సూర్య ప్రకాష్. మరి ఆ హత్య కేసులో సూర్య ప్రకాష్ ని ఇరికించింది ఎవరు? ఆద్య (వరలక్ష్హి శరత్ కుమార్) అనే లాయర్ సూర్య ప్రకాష్ కి ఎలా అండగా నిలుస్తుంది?
లాయర్ హత్య కేసులో అసలు దోషులెవరు? జైలు నుండి సూర్య ప్రకాష్ ఎలా బయట పడ్డాడు? అనేది నాంది మిగతా కథ.
పెరఫార్మెన్స్:
అల్లరి నరేష్ మిడిల్ క్లాస్ యువకుడు సూర్య ప్రకాష్ పాత్రలో అదరగొట్టే పెరఫార్మెన్స్ ఇచ్చాడు. ఇప్పటివరకు కమెడియన్ గా చూసిన అల్లరి నరేష్ ని అప్పుడప్పుడు పెరఫార్మర్ గా చూసినా.. నాంది సినిమాలో నెక్స్ట్ లెవెల్ పెరఫార్మెన్స్ చూపించాడు అంటూ అందరూ అప్రిషెట్ చేస్తున్నారు. ఇక మీదట విభిన్నమైన పాత్రల్లో మనం అల్లరి నరేష్ ని చూడొచ్చు. జైలు సీన్స్ లో అల్లరి నరేష్ ఎమోషనల్ గా చూపించిన హావభావాలు, నరేష్ పెరఫార్మెన్స్ సినిమాకే హైలెట్ అనేలా ఉంది. ఆద్య గా లాయర్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అదిరిపోయే పెరఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర పరిచయం, ఇంటర్వెల్ సీన్స్ లో ఆమె నటన, కోర్టు హల్ లో వరలక్ష్మి పెరఫార్మెన్స్ అన్ని సినిమాకే కీలకంగా ఉన్నాయి. ప్రియదర్శి అక్కడక్కడా నవ్వించాడు. హరిశ్ ఉత్తమన్, వినయ్ వర్మలు విలన్స్ గా మెప్పించారు. మిగతా వారు పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
అల్లరి నరేష్ సినిమా అంటేనే కామెడీ లేకుండా సినిమా ఉండదు అని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. ఆ కామెడీ పూర్తి రొటీన్ గా మారిపోయి.. అల్లరి నరేష్ కెరీర్ ముగింపు దశలో ఉన్న టైం లో కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల నాంది సినిమాతో అల్లరి నరేష్ కెరీర్ కి మరోసారి నాంది పలికాడు. రొటీన్ కి భిన్నంగా చేసిన సీరియస్, ఇంటెన్స్ మూవీ నాంది. నాంది సీరియస్ మూవీ అనేది నాంది ప్రోమోస్ లోనే అర్ధమైంది. చేయని నేరానికి జైలు పాలైన ఓ అమాయకుడు న్యాయం కోసం చేసే పోరాటమే నాంది సినిమా కథ. చట్టంలోని ఒక కొత్త సెక్షన్ 211 గురించి చెప్పి.. అది ఎంత శక్తివంతమైందో అని ఆలోచన రేకెత్తించేలా చేసారు. నాంది ఫస్ట్ హాఫ్ మొత్తం సామాన్యుమైన యువకుడు.. తనకి ఉద్యోగం వచ్చాక తల్లితండ్రుల కన్న చిన్న చిన్న కలలు తీర్చడం కోసం చేసే ప్రయత్నాలు, అన్యాయంగా జైలు పాలవడం వంటి సీన్స్ తో గడిచిపోయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ లోని ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఉత్కంఠ ని పెంచుతుంది. సెకండ్ హాఫ్ లో కోర్టు సీన్స్, అందులో సాగే సన్నివేశాలు ఉత్కంఠగా అనిపించడమే కాదు.. సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. తనను ఇరికించిన పోలీస్ మీద రివర్సులో 211 కేసు పెట్టడం.. దాని కోసం పోరాడటం ఈ సినిమాలో కొత్తగా అనిపిస్తుంది. దాని చుట్టూ నడిపిన కథనం ఆకట్టుకుంటుంది. దర్శకుడు విజయ్ కనకమేడలో ఏ దశలోనూ కథ మీద పట్టుకోల్పోకుండా సినిమాని నడిపించాడు. అల్లరి నరేష్ పెరఫార్మెన్స్ తో సినిమా వేరే లెవెల్ కి వెళ్ళింది. ఈ సినిమాలో అల్లరి నరేష్ మేకోవర్ కూడా అద్భుతంగా ఉంది. అల్లరి నరేష్ కెరీర్ కి ఈ సినిమా నిజంగా మరో మలుపు కాదు.. కీలక మలుపుకి నాంది అనే చెప్పాలి.
సాంకేతికంగా:
శ్రీ చరణ్ పాకాల సంగీతం ఓకె ఓకె . పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఉన్న రెండు మూడు పాటలు కూడా చిన్నవే. నేపథ్య సంగీతం ఎమోషనల్ సన్నివేశాల్లో శ్రీ చరణ్ అదరగొట్టేసాడు. సిద్ సినిమాటోగ్రఫీ బావుంది. అబ్బూరి రవి డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.
రేటింగ్: 2.75/5