ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మూవీ రివ్యూ
నటీనటులు: ఆది సాయి కుమార్, కార్తీక్ రాజు, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: శ్రీ చరణ్ [more]
నటీనటులు: ఆది సాయి కుమార్, కార్తీక్ రాజు, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: శ్రీ చరణ్ [more]
నటీనటులు: ఆది సాయి కుమార్, కార్తీక్ రాజు, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రాఫర్: జైపాల్ రెడ్డి
ఎడిటర్: గ్యారీ బిహెచ్
నిర్మాతలు: ప్రతిభా అడవి, కట్టా ఆశిష్ రెడ్డి
దర్శకత్వం: అడివి సాయి కిరణ్
వరస పరాజయాలతో మార్కెట్ కి మార్కెట్టు, క్రేజు కి క్రేజు కోల్పోయిన ఆది సాయి కుమార్ ప్రస్తుతం ఇండస్ట్రీలో జీరో. కనీసం ప్లాప్ కూడా కాదు ఏకంగా డిజాస్టర్స్ సినిమాలే చేస్తున్న అది సాయి కుమార్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో అస్సలు ఆసక్తి లేదు. కాకపోతే అడవి శేష్ కుటుంబం లో ఓ వ్యక్తి ఆది సాయి కుమార్ సినిమా దర్శకత్వం చేస్తున్నాడు అంటే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. అందులోను సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే ప్రేక్షకులకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. వినాయకుడు, కేరింత వంటి సెన్సిబుల్ ఫ్యామిలీ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన అడివి సాయికిరణ్ చాలా అంటే చాలా రోజుల తరువాత దర్శకత్వం వహించిన చిత్రం ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ ఏన్ ఎస్ జీ కమెండోగా నటించాడు. సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ చేసుకోకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ తో ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
ఘాజీ బాబా (అబ్బూరి రవి) కరుడుగట్టిన ఉగ్రవాది. 1990లలో కశ్మీర్ పండిట్లను ఘాజీ బాబా(అబ్బూరి రవి) కశ్మీర్ ని వదిలి వెళ్లిపోవాలని అతి దారుణంగా చంపుతాడు. కాశ్మీర్ పండిట్‌ని ఊచకోత కోస్తూ వాళ్లతో బలవంతంగా మత మార్పిడులు చేయిస్తూ ఉంటాడు. అలా అతని చేతిలో అర్జున్ పండిట్ (ఆది సాయి కుమార్) తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోతారు. దాంతో చిన్నప్పటి నుంచే అర్జున్ ఘాజీ బాబా మీద కసితోనే ఎన్.ఎస్.జి కమాండోగా అవుతాడు. కమెండో అర్జున్ పండిట్ రెస్క్యూ ఆపరేషన్‌తో ఘాజీ బాబాని అరెస్ట్ చేస్తాడు. ఇతన్ని విడిపించడానికి ఘాజీ బాబా ప్రధాన అనుచరుడు ఫారుఖ్ (మనోజ్ నందన్) హైదరాబాద్ వస్తాడు. సెంట్రల్ మినిస్టర్ శర్మ (రావు రమేష్) కూతుర్ని కిడ్నాప్ చేయడం ద్వారా ఘాజీ బాబా విడిపించవచ్చని పథకం రచిస్తాడు ఫారుఖ్. ఈ క్రమంలో ఫారూఖ్ ని ఆపడానికి అర్జున్ ఏమి చేశాడు? ఘాజీని అతని గ్యాంగ్ ని ఎలా అంతం చేశాడు? ఇంతకీ ఆ గోల్డ్ ఫిష్ ఎవరు? అన్నదే మిగతా కథ.
నటీనటులు:
ఎన్ ఎస్ జీ కమెండోగా ఆది సీరియస్ పాత్రలో తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే ఈ సినిమాతో ఎయిర్ టెల్ మోడల్ శషా ఛెత్రీ నటించడానికి చాలా కష్టపడింది. కొన్ని సీన్లలో ఆమె ఎక్స్ ప్రెషన్స్ నవ్వుతుందో లేక ఏడుస్తుందో తెలియలేదు. నిత్యా నరేష్ మంచి ఫెర్ఫామెన్స్ ఇచ్చింది. కమెడియన్ నూకరాజు ఈ సినిమాలో పేలని పంచ్‌లు వేసి విసుగుపుట్టించాడు. కార్తీక్ రాజు నటనకు మంచి మార్కులే పడ్డాయి. మినిస్టర్ పాత్రలో రావు రమేష్ మెప్పించాడు కానీ ఆయన పాత్రకే సినిమాలో ఎక్కువ స్కోప్ లేకుండా పోయింది. ప్రతినాయకుడిగా చేసిన అబ్బూరి రవి ఉగ్రవాది పాత్రకు న్యాయం చేసినప్పటికీ.. సినిమా అంతా ఆయనే ఉన్నాడనిపిస్తుంది. మిగతా వారు తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.
విశ్లేషణ:
ఉగ్రవాదం, 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో కొన్ని వాస్తవపరిస్థితుల ఆధారంగా అల్లిన కమాండో ఆపరేషన్ కథే. ఈ ఆపరేషన్ గోల్డ్ ఫిష్. ఉగ్రవాదం కోరల్లో చిక్కుకున్న కాశ్మీరీ పండిట్స్ కోసం… ఉగ్రవాదుల చేతుల్లో బలైన కుటుంబం నుంచి వచ్చిన ఓ వ్యక్తి చేసిన పోరాటమే దీని కథ, కథనం. సినిమా ప్రారంభంలో కమాండో ఆపరేషన్స్, ఉగ్రవాదం, కాశ్మీర్ అంశాలను చర్చించి మంచి డెప్త్ ఉన్న కంటెంట్‌ని ప్రజెంట్ చేస్తున్నాడనే ఫీల్ గలిగించాడు దర్శకుడు. అయితే కథ ఎప్పుడైతే కాలేజ్‌కి షిఫ్ట్ అయ్యిందో ట్రాక్ తప్పింది. సీరియస్‌గా సాగుతున్న కథకు కాలేజ్ నేపథ్యం.. అందులో నాలుగు క్యారెక్టర్లు, ఇరికించి పెట్టిన కామెడీ అండ్ లవ్ ట్రాక్‌లు అసలు కథను పక్కదోవ పట్టించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కీలక సన్నివేశాలు బావున్నప్పటికీ.. కాశ్మీర్, ఉగ్రవాదం లాంటి ఇష్యూని డీల్ చేయడంలో సీరియస్ నెస్ లోపించింది. మినిస్టర్ కూతుర్ని కిడ్నాప్ చేయడానికి ఫారుఖ్ ప్రయత్నించడం.. ఆమెను రక్షించడానికి ఆది ప్రయత్నం చేయడం అంతా రొటీన్‌గా సాగింది. కొన్ని కీలక సన్నివేశాలన్నీ సహజత్వానికి దూరంగా సాగడం, కథనం కూడా ఇంట్రెస్ట్ గా సాగకపోవడం, అలాగే సెకండ్ హాఫ్ బోరింగ్ ట్రీట్మెంట్ తో అనవసరమైన సీన్స్ తో బాగా సాగతీయడం, పైగా మెయిన్ స్టోరీలోనే బలహీనమైన లోపాలు ఉండటం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఇక క్లైమాక్స్ లో హీరోకి ఫైట్ ఉండాలి కదా అని అనవసరంగా షిప్ లో ఫైట్ పెట్టారు. అసలు ఆ షిప్ లోకి వెళ్లకముందే హీరోకి విలన్ దొరికేశాడు. అక్కడే సినిమాని ముగించి ఉంటే బాగుండేది. ఏది ఏమైనా ఈ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మాత్రం ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి.
సాంకేతికంగా…
చరణ్ పాకాలా మ్యూజిక్ అంతంత మాత్రంగానే ఉంది. జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆ ఫీల్ ను తన కెమెరా యాంగిల్స్ తో కళ్ళకు కట్టినట్టు చూపించాడు అలాగే ఎడిటింగ్ ఓకేగా వుంది. నిర్మాణ విలువలు మాత్రం చాల పూర్ గా ఉన్నాయి.
రేటింగ్: 2.0/5