'పంతం' షార్ట్ & స్వీట్ రివ్యూ
యాక్షన్ హీరో గోపీచంద్ ఇటీవల సరైన హిట్లు లేక కెరీర్ పరంగా సతమతమవుతున్నాడు. గోపీ చివరి మూడు చిత్రాలు సౌఖ్యం - ఆక్సిజన్ - గౌతమ్‌నందా డిజాస్టర్లు అయ్యాయి. ఈ క్రమంలోనే గోపీచంద్ కొత్త దర్శకుడు చక్రవర్తి దర్శకత్వంలో నటించిన సినిమా పంతం. గోపీచంద్‌కు కలిసొచ్చిన చివర సున్నా సెంటిమెంట్‌తో వచ్చిన ఈ సినిమా గోపీకి హిట్ ఇస్తుందన్న నమ్మకాలు ఏర్పడ్డాయి. గోపీచంద్ కెరీర్లో 25వ సినిమాగా పంతం తెరకెక్కింది. కెకె.రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అవుతుండగా ఇప్పటికే ప్రీమియర్లు కంప్లీట్ చేసుకుంది. మరి ప్రీమియర్ల టాక్ ప్రకారం పంతం ఎలా ఉందో తెలుగుపోస్ట్.కామ్ షార్ట్ రివ్యూలో చూద్దాం.
గోపీచంద్ విక్రాంత్ క్యారెక్టర్లో నటించాడు. హీరో తన గ్యాంగ్‌తో కలిసి ప్రముఖ రాజకీయ నాయకుల ఇళ్లల్లో దొంగతనాలు చేస్తుంటాడు. ఈ క్రమంలోనే మినిస్టర్ నాయక్ (సంపత్) ఇంట్లో పెద్ద దొంగతనం చేస్తాడు. మినిస్టర్ ఇంట్లో జరిగిన ఈ దొంగతనంపై పోలీసులు సీరియస్‌గా విచారణ చేస్తున్న క్రమంలోనే విక్రాంత్ గ్యాంగ్‌లో కొందరు దొరుకుతారు. ఈ క్రమంలోనే ఈ గ్యాంగ్‌ను లీడ్ చేస్తోంది విక్రాంత్ అని తెలుసుకున్న మినిస్టర్ నాయక్... అతడి గురించి తెలుసుకుని షాక్ అవుతాడు. అసలు విక్రాంత్ ఇలా రాజకీయ నాయకులను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ? దీని వెనక ఉన్న కథేంటి ? అన్నదే పంతం సినిమా స్టోరీ.
గోపీచంద్‌కు చాలా రోజుల తర్వాత పంతం రూపంలో మంచి సినిమా వచ్చింది. మంచి సోషల్ మెసేజ్‌తో దర్శకుడు చక్రవర్తి కథనాన్ని నడిపించడంలో సక్సెస్ అయ్యారు. కొన్ని వేస్ట్ సీన్లు ఉన్నా కామెడీ, యాక్షన్, సోషల్ మెసేజ్, పొలిటికల్ యాంగిల్స్ సినిమాను నిలబెట్టాయి. గోపీచంద్ డిఫరెంట్ వేరియేషన్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. యాక్షన్ సీన్లలోనూ, డైలాగ్ డెలివరీలోనూ గోపీచంద్ నటన సినిమాకు హైలెట్. ఇక హీరోయిన్ మెహరీన్ పాత్ర వరకు జస్ట్ ఓకే. నిర్మాత రాధామోహన్ సినిమాను చాలా లావీష్‌గా తెరకెక్కించారు.
ఇక హీరో - హీరోయిన్ల మధ్య సీన్లు పెద్దగా ఆకట్టుకోకపోవడం, పాటలు, సాగదీసినట్టు ఉన్న సెకండాఫ్ సినిమాకు మైనస్. కామెడీ, ఫస్టాఫ్, క్లైమాక్స్, కోర్టు సీన్లు, యాక్షన్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు, డైరెక్షన్ ఇవన్నీ సినిమాకు ప్లస్‌లు. ఓవరాల్‌గా రెగ్యులర్ ఫార్మాట్లో వచ్చిన మాంచి సోషల్ మెసేజ్ ఉన్న కమర్షియల్ సినిమాగా పంతం నిలిచింది. పంతం పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్.కామ్