Mon Dec 23 2024 07:08:46 GMT+0000 (Coordinated Universal Time)
Eagle : సంక్రాంతి రిలీజ్ నుంచి రవితేజ అవుట్..!
రవితేజ 'ఈగల్' సినిమా సంక్రాంతికి రావడం లేదా..? పోస్టుపోన్ అయ్యిందా..? ఎప్పుడు రాబోతుంది..?
Eagle : మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఈగల్'. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. కావ్య తపర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, వినయ్ రాయ్, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.
ఇక సంక్రాంతికి జనవరి 13న థియేటర్స్ లో సినిమా చేసుందుకు రావణ అభిమానులు సిద్ధమవుతుంటే.. ఇప్పుడు ఈ చిత్రం పోస్టుపోన్ అన్న వార్త వినిపిస్తుంది. ఈసారి సంక్రాంతికి సినిమాల సందడి కొంచెం ఎక్కువ గానే ఉంది. ఈ చిత్రంతో పాటు తేజ సజ్జ 'హనుమాన్', మహేష్ బాబు 'గుంటూరు కారం', వెంకటేష్ 'సైంధవ్', రవితేజ 'ఈగల్', నాగార్జున 'నా సామీ రంగ' సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.
దీంతో కొన్ని సినిమాలకు కావాల్సిన థియేటర్స్ దొరకడం లేదు. ఇలా తక్కువ థియేటర్స్ తో రావడం కంటే.. తరువాత రావడం బెటర్ అని ఈగల్ టీం ఫీల్ అయ్యినట్లు తెలుస్తుంది. అందుకనే ఈ చిత్రాన్ని జనవరి 26కి పోస్టుపోన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త రవితేజ అభిమానులను కొంచెం బాధిస్తుంది. అయితే ఈ వాయిదా గురించి ఈగల్ టీం నుంచి ప్రకటన రావాల్సి ఉంది.
Next Story