Sun Dec 22 2024 17:47:43 GMT+0000 (Coordinated Universal Time)
Swag movie review: శ్రీ విష్ణు 'స్వాగ్' మూవీ రివ్యూ
ఈ సినిమా మొత్తం కన్ఫ్యూజన్ డ్రామా గా మొదలై.. ఓ మెసేజీ
నటుడు శ్రీవిష్ణు సినిమా అంటే చాలు యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే శ్రీ విష్ణు కు 'కింగ్ ఆఫ్ కంటెంట్' అనే పేరు ఉంది. ఏ సినిమా చేసినా కూడా కంటెంట్ కంపల్సరీ అన్నది శ్రీ విష్ణు స్టైల్. అదే కోవలోకే వస్తుందని 'స్వాగ్' సినిమా టీజర్, ట్రైలర్లు చూస్తే అర్థం అవుతుంది. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి.
కథ:
1551లో, వింజమర రుఖ్మిణి దేవి (రీతు వర్మ) పురుషులను బానిసలుగా చేసుకుని పాలిస్తూ ఉంటుంది. ఆమె ఆడ శిశువులకు మాత్రమే జన్మనివ్వాలని ఎదురుచూస్తూ ఉంటుంది. మగవారి పట్ల తీవ్రమైన ద్వేషాన్ని కలిగి ఉండటం వల్ల ఆమె మగ శిశువులను చంపిందని కూడా తెలుసుకుంటారు. ఆమె భర్త, స్వాగనిక భవభూతి (శ్రీ విష్ణు) పితృస్వామ్య సమాజాన్ని స్థాపించాలని కోరుకుంటాడు.
మళ్లీ 2024లో కథ మొదలవుతుంది. SI భవభూతి(శ్రీవిష్ణు) పదవీ విరమణ పొందుతాడు. అయితే ఆడవాళ్ల మీద భవభూతికి ఉన్న వివక్ష కారణంగా పెన్షన్, ఇతర ప్రయోజనాలను నిలిపివేయాలని మహిళా ఉన్నతాధికారి నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇంతలో తాను రాజ కుటుంబానికి చెందినవాడని, భారీ మొత్తంలో నిధి వారసత్వంగా అందుకుంటూ పేర్కొంటూ ఒక లేఖ వస్తుంది. అయితే ఆ నిధికి వారసులు ఎవరు? నిధి భవభూతికి దక్కుతుందా? నిధికి వారసులు ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!!
ఎలా ఉంది.. ఎలా సాగుతుందంటే:
ఈ సినిమా మొత్తం కన్ఫ్యూజన్ డ్రామా గా మొదలై.. ఓ మెసేజీ ఓరియెంటెడ్ గా ముగుస్తుంది. శ్రీవిష్ణు అత్యద్భుతమైన నటుడిగా మరోసారి తన సత్తా చాటుకున్నాడు. విభిన్న పాత్రలకు అతని లుక్స్, బాడీ లాంగ్వేజ్ ప్రత్యేకంగా, విభిన్నంగా ఉంటాయి. ట్రాన్స్‌జెండర్ క్యారెక్టర్లో అతని లుక్, పెర్ఫార్మెన్స్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రీతూ వర్మకు మంచి పాత్ర దక్కింది. ఆమె బాగా నటించింది కూడా. చాలా రోజుల తర్వాత తెలుగు తెర మీద కనిపించిన మీరా జాస్మిన్‌కు అంత గొప్ప పాత్ర అయితే దక్కలేదు. ఇక మిగిలిన పాత్రలు పెద్దగా కనెక్ట్ అవ్వవు.
దర్శకుడు హసిత్ గోలీ ఆడియన్స్ ను మొదట బాగా కన్ఫ్యూజన్ పెట్టినా.. ఆ తర్వాత మాత్రం క్లారిటీ ఇవ్వడానికి చాలానే కష్టపడ్డాడు. మాతృస్వామ్య సమాజం ఎలా పితృస్వామ్య సమాజానికి దారితీసిందో వ్యంగ్య మార్గంలో చెప్పడానికి ప్రయత్నించాడు. ఇక మన సమాజంలో ఇప్పుడు ఎలా లింగ వివక్ష ఉందొ కూడా చాలా బాగా చూపించాడు.
ఎలాంటి లింగ భేదం లేకుండా మనుషులను మనుషులుగా అంగీకరించాలి అనే కథ చెప్పాలని అనుకున్నాడు. అయితే స్క్రీన్ ప్లే అంత ఆకట్టుకునే విధంగా అయితే లేదు. కోర్ ఎమోషన్‌ను మిస్ అవుతాం. అతను చెప్పాలనుకున్న పాయింట్ ను చెప్పడానికి చాలా కష్టాలే పడ్డాడు.
ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో విభూతి పాత్రకు అతను జోడించిన సున్నితమైన టచ్ కూడా బాగుంది. చెప్పాలనుకున్న పాయింట్ ను చెప్పాలని అనుకున్నప్పుడు మరీ ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని కూడా మనకు అనిపిస్తుంది. వివేక్ సాగర్ మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. చక్కటి విజువల్స్ ఉన్నాయి.. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొన్ని చోట్ల మంచి నిర్మాణ విలువలు చూపించినా, మరికొన్ని చోట్ల ఏమీ లేనట్లుగా చూపిస్తుంది. ఇక అప్పటి కాలంలో రాజ్యాన్ని చూపించే సమయంలో ఇంకొన్ని మార్పులు చేర్పులు చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది.
ఫైనల్ గా..
కొన్ని చోట్ల మెప్పించినా, నవ్వించినా.. పూర్తిగా అలరించడంలో మాత్రం సినిమా విఫలమవుతుంది.

Next Story