'శ్రీనివాస కళ్యాణం' షార్ట్ & స్వీట్ రివ్యూ
కెరీర్లో ఇటీవల సరైన సక్సెస్‌లు లేక ఇబ్బందులు పడుతోన్న హీరో నితిన్ తన చివరి సినిమా ఛల్ మోహన్‌రంగ సినిమాతో నిరాశ పరిచాడు. తాజాగా దిల్ రాజు బ్యానర్లో శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం. రాశీఖన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే టీజర్లు, ట్రైలర్లతో ఆకట్టుకుంది. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుగుపోస్ట్.కామ్ షార్ట్ రివ్యూలో ఓ లుక్కేద్దాం.
దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ సినిమాను కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. సినిమాలో కుటుంబంలో ఉండే బంధాలు, అనుబంధాల నేపథ్యంలో అల్లుకున్న కథ, కథనాలు మంచి ఫీల్ ఇచ్చాయి. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయాల్లో వివాహానికి ఉన్న విశిష్టత గురించి తెరమీద సూపర్బ్‌గా ప్రజెంట్ చేశారు. పెళ్లి అనేది నేటి కాలంలో ఏదో ఒక రోజులో సింపుల్‌గా జరిపేస్తున్నారు. వివాహానికి ఉన్న విశిష్టత... ఇది ఎంత అపూర్వ వేడుకో అని చెప్పే ప్రయత్నం బాగుంది.
సినిమాలో తెరనిండా ఎక్కువ మంది ఆర్టిస్టులతో ప్రతి సీన్ నిండుదనంగా కనపడింది. ముఖ్య పాత్రల్లో నటించిన జయసుధ, ప్రకాష్ రాజ్, నరేష్, రాజేంద్ర ప్రసాద్, సితార వంటి ఎందరో సీనియర్ నటులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. నితిన్ - రాశీఖన్నా ఫెయిర్ తెరమీద చక్కగా సెట్ అయ్యింది. సాంకేతికంగా సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్గా ఉంది. సినిమా మేజర్ హైలెట్స్‌లో ఈ విభాగానికి మంచి మార్కులు పడతాయి. ఇక మిక్కీ జే మేయర్ మ్యూజిక్ మరో బలం. దిల్ రాజు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించాడు.
దర్శకుడు సతీష్ వేగేశ్న తాను గతంలో తీసిన శతమానం భవతి సినిమా టైప్‌లోనే ఈ సినిమాను కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా తెరకెక్కించాడు. వివాహానికి మన భారతీయ సంప్రదాయంలో ఉన్న విశిష్టత ఎంత గొప్పగా ఉందో చెప్పే ప్రయత్నంలో అతడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్ (+) :
- మెసేజ్ ఓరియంటెడ్ సినిమా
- ఫీల్‌గుడ్
- పెద్దలకు పాత రోజులు గుర్తు చేసింది
- తెలుగు సంప్రదాయాలను చాలా హుందాగా ప్రజెంట్ చేయడం
- ఆహ్లాదరకరంగా ఉన్న పాటలు
- నితిన్ - రాశీఖన్నా ఫెయిర్
- సినిమాలో టోటల్ కాస్టింగ్ సూపర్
- డైలాగులు హైలెట్
మైనస్ పాయింట్స్ (-) :
- సంబంధం లేని పాయింట్లు బలవంతంగా ఇరికించడం
- మరీ కొత్తగా లేని మెయిన్ స్టోరీ లేని
ఫైనల్‌గా...
ఓవరాల్‌గా శ్రీనివాస కళ్యాణం టోటల్‌గా ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా. సకుటుంబ సపరివార సమేతంగా చూసే ఈ సినిమా యూత్‌కు మిగిలిన మాస్ ప్రేక్షకులకు ఎంత వరకు నచ్చుతుందో ? చూడాలి. ఓవరాల్‌గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి మార్కులే సొంతం చేసుకునే ఛాన్సులు ఉన్నాయి. మరి పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్.కామ్