అర్జున్ రెడ్డి మూవీ రివ్యూ
నటీనటులు : విజయ్ దేవరకొండ, షాలిని పాండే, కమల్ కామరాజు
సంగీతం : రధన్
నిర్మాత : ప్రణయ్ రెడ్డి వంగా
దర్శకత్వం : సందీప్ రెడ్డి వంగా
'అర్జున్ రెడ్డి' సినిమా టీజర్, ట్రైలర్ తోనే అందరి చూపు తమ మీద పడేలా చేసుకుంది. 'పెళ్లి చూపులు' చిత్రంలో మంచి నటనతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ద్వితీయ విజ్ఞానాన్ని అధిగమించలేకపోయాడు. 'ద్వారకా' చిత్రంతో ప్లాపుని మూటగట్టుకున్న తర్వాత విజయ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ఈ 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని చేసాడు. అసలు ఈ చిత్రం కథకన్నా ఎక్కువ కాంట్రోవర్సీ మీదే విపరీతమైన పబ్లిసిటీ అయ్యింది. 'అర్జున్ రెడ్డి' టీజర్ నే బూతు పురాణంతో స్టార్ట్ చేసిన ఈ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమా విడుదలకుముందు లిప్ లాక్ కిస్సులున్న పోస్టర్స్ తో హడావిడి చేసి అందరి అటెన్షన్ ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేసి దానిలో చిత్ర టీమ్ మొత్తం సక్సెస్ అయ్యింది. సెన్సార్ బోర్డు 'ఎ' సర్టిఫికేట్ ఇచ్చినా కేర్ చెయ్యకుండా లైట్ తీసుకుని 'అర్జున్' రెడ్డి విడుదలకు ఒక రోజు ముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ వేసి మరీ తమ ధైర్యాన్ని చాటి చెప్పారు దర్శక నిర్మాతలు. అలాగే 'అర్జున్ రెడ్డి' హీరో విజయ్ కి కూడా సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండబట్టి కయ్యానికి కాలు దువ్వాడు. అందులోను విజయ్ 'అర్జున్ రెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కంట్రవర్సల్ గా మట్లాడి అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే 'అర్జున్ రెడ్డి' లిప్ లాక్ కిస్ ల పోస్టర్స్ మీద తలెత్తిన రగడ... సినిమాకి నెగెటివ్ పబ్లిసిటీ జరగడమే కాదు సినిమాపై ఆటోమాటిక్ గా అంచనాలు పెంచేసింది. మరి హీరో విజయ్ కి సినిమా మీద ఎంత నమ్మకం లేకపోతె కెరీర్ ఆరంభంలోనే ఇలా కాంట్రవర్సీ అవుతాడు. అయితే ఈ సినిమా కేవలం యువతకే అని విజయ్ దేవరకొండ ముందు నుండి చెబుతూనే ఉన్నాడు. మరి విడుదలకు ముందునుండే ఈ సినిమాకి వచ్చిన నెగెటివ్ పబ్లిసిటీతో ఈ సినిమా టికెట్స్ హోల్సేల్ గా అమ్ముడుపోయాయి. అందుకే సినిమా ఓపెనింగ్స్ కూడా గట్టిగా వస్తాయనే నమ్మకంతో చిత్ర టీమ్ కాన్ఫిడెంట్ గా వుంది. మరి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండాలు పెట్టుకున్న అతి నమ్మకాన్ని ఈ 'అర్జున్ రెడ్డి' చిత్రం ఏ మాత్రం నిజంచేసిందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ :
కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని, విపరీతమైన స్వాతంత్ర్య భావాలున్న మెడికల్ స్టూడెంట్ అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ). స్వతహాగా కోపిష్టి అయిన అర్జున్ రెడ్డిది చాలా దూకుడు మనస్తత్వం.నోటికి ఎంతోస్తే అంతా అనేయటం అతని నైజం. ఈ అర్జున్ రెడ్డి మెడికల్ కాలేజ్ లో తన జూనియర్ ప్రీతి శెట్టి (షాలిని పాండే) ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. కొన్నిరోజులకు ఆ అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది. అలా ఒకరికొకరు మానసికంగా, శారీరకంగా దగ్గరైన ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ ప్రీతి తండ్రి వాళ్ళ నిజమైన ప్రేమను అర్థం చేసుకోకుండా ప్రీతిని వేరే వాళ్లకు ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ప్రీతీ వేరెవరినో పెళ్లి చేసుకుందని బాధతో మానసిక వ్యధకు గురై, పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన అర్జున్ రెడ్డిని చివరికి ఇంట్లోంచి బయటికొచ్చేస్తాడు. ఒక ప్రవేట్ హాస్పిటల్ లో ఉద్యోగం చేసుకుంటూ అన్ని చెడు అలవాట్లకు బానిసై రోజు రోజుకి కుంగిపోతూ దిగజారిపోతాడు. అలాంటి సమయంలోనే అర్జున్ రెడ్డి హాస్పిటల్ లో చేసిన ఒక ఆపరేషన్ ఫెయిల్ అయ్యి కేసులో ఇరుక్కోవడమే కాకుండా ఎంతో ఇష్టమైన డాక్టర్ వృత్తిని కూడా వదులుకోవాల్సి వస్తుంది. మరి అర్జున్ రెడ్డి ఆ కేసు నుండి బయటపడతాడా? అసలు ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య అర్జున్ రెడ్డి మానసిక పరిస్థితి ఏంటి ? డాక్టర్ వృత్తిని కోల్పోయిన అర్జున్ రెడ్డి చివరకు మళ్ళీ ఆ వృత్తిలోకి వస్తాడా? చివరికి అతనికి ప్రీతి మీదున్న ప్రేమ గెలిచిందా లేదా ? అనేది మాత్రం వెండితెర మీద అర్జున్ రెడ్డి చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల పనితీరు:
అర్జున్ రెడ్డి సినిమా మొత్తం హీరో విజయ్, హీరోయిన్ షాలిని ల చుట్టూనే తిరుగుతుంది. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లో సింప్లీ అమేజింగ్ నటనతో ఆకట్టుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో తండ్రితో తిట్లు తింటూ ఫ్యూచర్ గురించి కన్ఫ్యూజ్ అయ్యే కుర్రాడు గా కనిపించిన విజయ్ దేవరకొండ ఈ అర్జున్ రెడ్డి లో... తేడాగా, బాగా తిక్క ఉన్న కూరడిగా అంటించి మెప్పించాడు. అసలు విజయ్ అర్జున్ రెడ్డి పాత్రకు ప్రాణం పోసాడు. తన చుట్టూ ఉన్న నిస్సహాయ పరిస్థితుల పట్ల అసహనం చూపించే పాత్రలో అద్భుతమైన పెర్ఫార్మన్స్ టిప్ విజయ్ రెచ్చిపోయి నటించాడు. మంచి కథ గనక సెట్ అయితే తనలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడని విజయ్ దేవరకొండ మరో సారి రుజువు చేసాడు. ఇక హీరొయిన్ షాలిని పాండే విషయానికి వస్తే ఆ అమ్మాయి చాలా క్యూట్ గా, హోమ్లీ గా అర్జున్ ప్రేమ కోసం తపించిపోయే ప్రియురాలిగా చాలా బాగా మెప్పించింది. కానీ షాలిని పాత్రకి ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఇంపార్టెన్స్ సెకండ్ హాఫ్ లో లేకుండా చేసాడు దర్శకుడు. .ఇక మిగతా నటీనటుల్లో అర్జున్ రెడ్డి ఫ్రెండ్ గా నటించిన రాహుల్ రామకృష్ణ మాత్రం అదరగొట్టాడు. సినిమా మొత్తం అర్జున్ రెడ్డి పక్కనే ఉంటూ కావాల్సిన కామెడీ అందించాడు.ఇకమిగతానటీనటులు తమ పరిధిమేర నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ..... రైటర్ గా, డైరెక్టర్ గా అతని తపన, డెడికేషన్ ఈ అర్జున్ రెడ్డి సినిమాని మలిచిన విధానంలో కనిపిస్తుంది. మూవీని ఎమోషన్, కామెడీ తో లింకప్ చేస్తూ ఆసక్తి కలిగేలా తీసాడు. అయితే క్లైమాక్స్ విషయంలో ప్రేక్షకులని డిస్పాయింట్ చేయడం ఇష్టం లేక సుఖాంతంగా పూర్తి చేసాడు. నిజానికి సినిమాలో వివాదాస్పద లిప్ కిస్ అనేది సినిమా కు చాల అవసరం. వల్గారిటీ లేకుండా హీరో హీరోయిన్ లవ్ మేకింగ్ చూపించిన డైరెక్టర్ వాళ్ళు విడిపోయిన తర్వాత లవ్ లో ఉండే పెయిన్ చూపించడానికి వాళ్ళ అటాచ్మెంట్ తెలపడానికి లిప్ కిస్ వాడాడు. అయితే డైరెక్టర్ తొలి ప్రయత్నం కావడం దాంతో సొంత ప్రొడక్షన్ అనే సరికి రిస్క్ చేయలేక ప్రతి చిన్న ఎక్సప్రెషని స్క్రీన్ ఫై చూపించడంతో లెన్త్ బాగా పెరిగింది. రాజు తోట సినిమాటోగ్రఫీ చాలా నీట్గా ఉంది. ప్రతి సన్నివేశం అందంగా చూపించి సినిమాకి రిచ్ లుక్ తీసుకొచ్చాడు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే రధన్ ఇచ్చిన మ్యూజిక్ ఆకట్టుకునేలా వుంది. అన్ని పాటలో సుందరి అనే సాంగ్ హైలెట్. ఇక అర్జున్ రెడ్డి కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ గా ఇచ్చాడు రధన్. ఇప్పుడు హాయ్ టాక్ తెచ్చుకున్న ఈ అర్జున్ రెడ్డి కి ఎడిటింగ్ విషయంలో కేర్ తీసుకున్నట్లయితే సూపర్ హిట్టయ్యేదనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కట్ చెయ్యాల్సిన సీన్స్ చాలానే ఉన్నాయి. ఇక నిర్మాణ విలువలు సినిమాకి రిచ్ నెస్ తెచ్చింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చిత్రాన్ని నిర్మించారు.
ప్లస్ పాయింట్స్: విజయ్ దేవరకొండ, మ్యూజిక్, దర్శకత్వం, రాహుల్ కామెడీ, ఫస్ట్ హాఫ్ లవ్ ట్రాక్
మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్ లో లెంగ్త్, మరీ బోల్డ్ గా ఉన్న కొన్ని సీన్స్
రేటింగ్: 2 .75 /5