Tue Nov 26 2024 01:52:42 GMT+0000 (Coordinated Universal Time)
ఇజం రివ్యూ : కల్యాణ్‌రామ్ వన్ మ్యాన్ షో
నటీనటులు : కళ్యాణ్ రామ్, అదితి ఆర్య, జగపతి బాబు
సంగీతం అనూప్ రూబెన్స్
ప్రొడ్యూసర్ : కళ్యాణ్ రామ్
డైరెక్టర్ : పూరీ జగన్నాధ్
తమ్ముడు ఎన్టీఆర్ 'టెంపర్' తో హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మళ్లీ ఫామ్ లోకొచ్చిన పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ తో తీసిన చిత్రం 'ఇజం'. ఈ 'ఇజం' చిత్రం మొదలైనప్పటినుండి టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. దీనికి కారణాలు అనేకం.
మీడియా మీద సెటైరికల్ గా ఈ సినిమా ఉంటుందని, మరో పక్క కళ్యాణ్ రామ్ సిక్స్ పాక్ తో అలరిస్తాడని, ఈ 'ఇజం' సినిమాలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేసాడని... ఇలా ఏదో ఒక న్యూస్ తో ఎప్పుడూ వార్తల్లో నిలిచింది ఈ 'ఇజం' సినిమా. తమ్ముడికి 'టెంపర్' హిట్ ఇచ్చిన పూరి మరి అన్నయ్య కళ్యాణ్ రామ్ కి 'ఇజం' తో ఎలాంటి హిట్ ఇచ్చాడో, ఇన్ని రోజులూ సెన్సేషనల్ న్యూస్ గా నిలిచినా ఈ మూవీలో విషయం ఎంతుందో తెలుసు కోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కథ : సత్య (కళ్యాణ్ రామ్) ఒక జర్నలిస్ట్. అతనికి ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు. అతనే జావేద్ భాయ్(జగపతిబాబు). సత్య తాను చిన్నప్పుడు ఎదుర్కొన్న కొన్ని సంఘటనల కారణం గా చాలా కోల్పోతాడు. ఇక తనకి జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని... అలాగే సమాజం లో అన్యాయాన్ని ఎదిరించాలని కంకణం కట్టుకుని ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాలిపోతుంటారు. ఇక ఈ పోరాటం చెయ్యడానికి సత్య ఒక మాస్క్ ధరించి ఎవరికీ తన గురించి తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు. ఒక పక్క జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తూనే మరో పక్క అన్యాయం జరిగిన చోట మాస్క్ తో ప్రత్యక్షమవుతూ దానిని ఎదురిస్తూ ఉంటాడు. ఈ టైమ్ లోనే సత్య అధితి (అదితి ఆర్య) ప్రేమలో పడతాడు. ఇక దేశం లోని నల్లధనాన్ని కొల్లగొట్టి పేదలకి పంచడానికి మాఫియాడాన్ సత్య ఫ్రెండ్ అయిన జావేద్ భాయ్ టార్గెట్ చేస్తాడు. అసలు సత్య తన జీవితాల్లో జరిగిన సంఘటన ఏమిటి? అసలు జావేద్ భాయ్ కి సత్యకి స్నేహం ఎలా కుదిరింది? అతిథితో ప్రేమలో పడ్డ సత్య ఆమెని పెళ్లాడతాడా? అసలు సత్య చేసే న్యాయపోరాటంలో అతను విజయం సాధిస్తాడా? ఇక ప్రేమ వల్ల కూడా ఏమైనా ఇబ్బందులు పడ్డాడా? అనేది మాత్రం వెండితెర మీద చూడాల్సిందే.
పనితీరు: ఈ ఇజం చిత్రాన్ని కళ్యాణ్ రామ్ పూర్తిగా తన భుజాలమీద వేసుకున్నాడని ఇజం చూసిన వాళ్ళకి అర్ధమవుతుంది. కొత్తగా సిక్స్ పాక్ తో మెప్పించాడనే చెప్పొచ్చు. న్యూ లుక్ తో కాస్త డిఫరెంట్ గా ట్రై చేసాడు కళ్యాణ్ రామ్. ఒక పక్క జర్నలిస్టుగా మరో పక్క మాస్క్ మాన్ గా కళ్యాణ్ రామ్ నటనలో ఇరగదీశాడు. పూరి ఒక మెస్సేజ్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. పూరి డైరెక్షన్ గురించి అందరికి తెలుసు. అతని ఎప్పుడూ ఎదో కొత్తగా ట్రై చేస్తూనే ఉంటాడు. తానూ చెప్పదలచుకున్నది ఒక్క లైన్ తో డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేసాడు ఈ సినిమాని పూరి. కథ, కథనం విషయం లో పూరి కొంచెం కేర్ తీసుకుంటే బావుండేది. ఫస్ట్ హాఫ్ తో కొంచెం బాగానే నడిపించాడు పూరి. సెకండ్ హాఫ్ మాత్రం బాగా డల్ చేసేసాడు. సెకండ్ హాఫ్ ని మరీ గజి బిజీ చేసేసాడు. ఇక జగపతి బాబు రోల్ మొదట్లో గట్టిగా చూపించి చివరికి వచ్చేసరికి పూర్తిగా తేల్చేసాడు. అసలు సత్య , జావేద్ ని శిక్షించకుండా వదిలెయ్యడం అనేది ప్రేక్షకుడు జీరించుకోలేని పరిస్థితి. ప్రీ క్లైమాక్ పర్వాలేదనిపించినప్పటికీ క్లైమాక్ మాత్రం తేలిపోయింది. ఇక హీరోయిన్ కి ప్రాధాన్యమున్న పాత్రని ఇవ్వకుండా పూరి ఆమె ని కొన్ని సీన్స్ కి మాత్రమే పరిమితం చేసాడు. ఇజం లో పాటలు పర్వాలేదనిపించాయి. ముఖేష్ జి సినిమాటోగ్రఫీ బాగుంది. జునైద్ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.
చివరిగా పూరి తమ్ముడు ఎన్టీఆర్ కి టెంపర్ తో సక్సెస్ అయితే ఇచ్చాడు గాని.... ఇజం తో అన్నకల్యాణ్ కి సక్సెస్ ని ఇవ్వడం లో కొంచెం తడబడ్డాడు. కాకపొతే టెంపర్ లో ఎన్టీఆర్ నుండి ఎలాంటి నటన అయితే రాబట్టాడో ఇజం లో అంతకంటే ఎక్కువగా కళ్యాణ్ రామ్ నుండి నటన ని రాబట్టాడు. ఓవరాల్ గా చూస్తే కళ్యాణ్ రామ్ కోసం ఈ ఇజం చిత్రాన్ని ఒకసారి తిలకించొచ్చు.
ప్లస్ పాయింట్స్: కళ్యాణ్ రామ్, జగపతి బాబు, పూరి దర్శకత్వం
మైనస్ పాయింట్స్: కథ, కథనం, స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్, క్లైమాక్
రేటింగ్ : 2.0/5
Next Story