నన్ను వదిలి నీవు పోలేవులే మూవీ రివ్యూ
చిత్రం - నన్ను వదిలి నీవు పోలేవులే
బ్యానర్స్ - బీప్ టోన్ స్టూడియోస్, శ్రీ కామాక్షి మల్టీమీడియా ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు - బాలకృష్ణ కోలా, వామికా, కళ్యాణ్ నటరాజన్, శరణ్, పార్వతి నాయర్ తదితరులు
సంగీతం - అమిత్ర్
సినిమాటోగ్రాఫర్ - శ్రీధర్
ఎడిటింగ్ - రాకేష్
నిర్మాతలు - కోలా భాస్కర్, కంచెర్ల పార్థసారథి
దర్శకత్వం - గీతాంజలి శ్రీరాఘవ
బాలకృష్ణ కోలా, వామికా జంటగా గీతాంజలి శ్రీరాఘవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నన్ను వదిలి నీవు పోలేవులే'. టైటిల్, ఈ సినిమా పోస్టర్స్ చూసిన వారు ఓ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కి ఉంటుందని భావిస్తున్నారు. మరి ఈ సినిమా అలానే ఉందా... అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా కనెక్ట్ అవుతుందా.. శ్రీ రాఘవ భార్య గీతాంజలి దర్శకురాలిగా ఏ మేరకు విజయం సాధించారు తెలుసుకుందాం.
కథ
ప్రభు (భాస్కర్ కోలా) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. సాదాసీదాగా కనిపించే ఈ కుర్రాడు ఐటి ఎంప్లాయ్. స్వచ్ఛమైన, నిజమైన ప్రేమను పొందాలనే ఆశయంతో తనకు నచ్చిన గుణాలతో ఉన్న అమ్మాయిలను అప్రోచ్ అవుతుంటాడు. అయితే తన లుక్స్ నచ్చక ఏ అమ్మాయి కూడా అతని ప్రపోజల్ ని అంగీకరించదు. రిజక్ట్ చేస్తుంటారు. కట్ చేస్తే...
మనోజ (వామికా) జీవితంలో పెళ్లి చేసుకోకూడదనే ఆలోచనతో ఉంటుంది. ఆమెకు ఎదురైన అనుభవాల వల్లే ఈ నిర్ణయం తీసుకుంటుంది. అయితే తన తల్లి ఆరోగ్యం బాగుండకపోవడంతో ఆమెను ఇబ్బందిపెట్టడం ఇష్టంలేక ప్రభుతో పెళ్లికి అంగీకరిస్తుంది మనోజ.
పెళ్లి చేసుకున్న ప్రభు, మనోజ మనోభావాలు కలవకపోవడంతో ఇద్దరి మధ్య సఖ్యత ఉండదు. ఇద్దరూ విడిపోతారు. తర్వాత ఇద్దరు తమ మధ్య నెలకొన్న ప్రాబ్లమ్స్ ని ఎలా క్లియర్ చేసుకున్నారు... ఇద్దరూ ఒకటయ్యారా అనేదే ఈ చిత్ర కథ.
నటీనటుల పెర్ ఫామెన్స్
బాలకృష్ణ కోలా మిడిల్ క్లాస్ కుర్రాడిగా బాగున్నాడు. అయితే నటన పరంగా మాత్రం ఇంకా మెరుగుపడాల్సి ఉంది. కొన్ని ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. మనోజ పాత్రకు వంద శాతం వామికా న్యాయం చేసింది. ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించింది. ఈ సినిమాకి వామికా ఓ ప్లస్ పాయింట్. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం
సింఫుల్ బడ్జెట్ తో సినిమా తెరకెక్కించినప్పటికీ, అవసరమైన చోట కాంప్రమైజ్ అవ్వకపోవడంతో నిర్మాణ విలువలు బాగున్నాయి. సీన్ లోకి ఇన్ వాల్వ్ అయ్యేలా మూడ్ ని క్రియేట్ చేయడానికి వాడిన లైటింగ్ సూపర్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ కూడా బాగుంది. కాకపోతే సెకండాఫ్ లోని ఓ పాటను ఎడిట్ చేసి ఉంటే సినిమా ఇంకా స్పీడ్ గా ఉన్న ఫీల్ ని కలుగజేస్తుంది. ఇక డైరెక్టర్ గీతాంజలి శ్రీరాఘవ విషయానికొస్తే... ఫస్టాప్ తెరకెక్కించిన విధానం బాగుంది. కానీ అదే టెంపోని సెకండాఫ్ లో మెయింటెన్ చేయలేకపోవడం ఈ సినిమాకి మైనస్ పాయింట్. టేకింగ్ పరంగా సినిమా బాగుంది. కానీ కొన్ని సీన్స్ విషయంలో గీతాంజలి మరింత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. సెకండాఫ్ ని ఇంట్రస్టింగ్ గా మలచడంలో కూడా ఆమె ఫెయిలయ్యారు.
ఫిల్మీబజ్ విశ్లేషణ
సింఫుల్ స్టోరీ లైన్. కొన్ని ఎమోషనల్ సీన్స్ తో ఈ చిత్రాన్ని మలిచిన విధానం బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాని బాగా ఎలివేట్ చేస్తుంది. హీరో, హీరోయిన్ మధ్య సాగే సీన్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కాకపోతే ఓ సాదాసీదా కుర్రాడు అందమైన అమ్మాయి ప్రేమలో పడటం 7/జి బృందావనం కాలనీ సినిమాని గుర్తుకు తెస్తుంది. ఆ స్టోరీ లైన్ మ్యారేజ్ అవ్వని అమ్మాయి, అబ్బాయితో సాగితే, ఈ స్టోరీ లైన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి, అబ్బాయి మధ్య సాగుతుంది. ఈ స్టోరీ లైన్ అన్ని వర్గాల ప్రేకకులకు కనెక్ట్ అవ్వదు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా లవర్స్ కి ఏ మాత్రం ఈ సినిమా కనెక్ట్ అవ్వదు. ఎండింట్ కూడ చాలా సింఫుల్ గా ఉంటుంది. హీరోయిన్ అనుభవించిన వేదన, బాధను అద్భుతంగా చూపించి, ప్రీ క్లయిమ్యాక్స్ లో ఒక్కసారిగా ఆమె తన మైండ్ సెట్ ని మార్చుకునే విధానం ఆడియన్స్ కి చాలా చప్పగా అనిపిస్తుంది.
ఫైనల్ గా చెప్పాలంటే... బాగా మెచ్చుర్టీ మైండ్ సెట్ ఉన్నవారిని, ఓ వర్గం వారిని మాత్రమే ఈ సినిమా ఆకట్టుకుంటుంది. రియాల్టీని ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. కమర్షియల్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రం ఈ సినిమా పెద్దగా కనెక్ట్ అవ్వదు.