నేనే రాజు - నేనే మంత్రి మూవీ రివ్యూ
నటీనటులు: రానా, కాజల్ అగర్వాల్, కేథరిన్ థెరిస్సా, తనికెళ్ళ భరణి, నవదీప్, అశుతోష్, అజయ్
మ్యూజిక్ డైరెక్టర్: అనూప్ రూబెన్స్
నిర్మాతలు: దగ్గుబాటి సురేష్ బాబు,కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
డైరెక్టర్: తేజ
రానా అనగానే ఇప్పుడు అందరికి బాహుబలిలో భళ్లాలదేవుడే గుర్తొచ్చేలా ఉంది.... ఆ సినిమాలోని రానా నటన. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఆహార్యం, డైలాగ్ డెలివరీ దేనికదే సాటిలా బాహుబలిలో భళ్లాలదేవాగా అద్భుతమైన నటన కనబర్చాడు. ఆ నటన జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెటింది. బాహుబలిలో విలన్ గా రానా నటనకు అందరూ మంత్ర ముగ్దులైపోయారుకూడా. అయితే బాహుబలి వంటి చిత్రంలో నటించిన తర్వాత రానా హీరోగా తేజ డైరెక్షన్ లో నేనే రాజు నేనే మంత్రి చిత్రాన్ని చేసాడు. ఈ చిత్రంలో రానా ని మరొక కోణంలో పరిచయం చేస్తున్నాడు తేజ. విభిన్నమైన పాత్రలో జోగేంద్ర గా రానా పంచెకట్టుతో ఆకట్టుకుంటున్నాడు. ఒక మాస్ పొలిటీషియన్ ఎలా ఉండాలో అలాంటి పాత్రలో రానా నటించాడు. డైరెక్టర్ తేజ ట్రాక్ రికార్డ్ ఏమంత బాగాలేకపోయినా కూడా కథ మీద నమ్మకంతోనే ఈ చిత్రాన్ని చేశానని రానా ఓపెన్ గానే చెప్పాడు. ఒకప్పుడు సందేశాత్మక చిత్రాలు చేసి హిట్ కొట్టిన తేజ మధ్యలో అర్ధం పర్ధం లేని చిత్రాలతో ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. అసలు తేజ సినిమా అంటేనే ప్రేక్షకులు భయపడేలా సినిమాలు చేసిన తేజకి ఈ నేనే రాజు నేనే మంత్రి తో బ్రేక్ వస్తుందనుకుంటున్నాడు. ఈ చిత్రానికి మరో మెయిన్ ప్లస్ పాయింట్ టాలీవుడ్ అందాల సుందరి కాజల్ అగర్వాల్, రానాతో జోడి కట్టడం. ఆమె తేజ కోరికను మన్నించి ఈ సినిమాలో చెయ్యడానికి ఒప్పుకుంది. కాజల్ అగర్వాల్ సంప్రదాయంగా చీర కట్టులో ఆకట్టుకునేలా కనిపిస్తూ..... అలాగే మరో హీరోయిన్ కేథరిన్ తెరిస్సా మందు, సిగరెట్ వంటివాటితో కనిపించి సినిమా పై మంచి అంచనాలను పెంచారు.. ప్రధానంగా కేథరిన్ అందాలు ఈ చిత్రానికి మరో మెయిన్ పాయింట్. నేనే రాజు నేనే మంత్రి లో రానా - కాజల్ అగర్వాల్ రొమాన్స్ సినిమాకే మెయిన్ హైలెట్ అంటూ ట్రైలర్, టీజర్ లో చూపించేసారు. రానాకూడా పొలిటికల్ లీడర్ గా అదరగొట్టే లుక్ లో కనబడుతున్నాడు. మరి సోలో హీరోగా టాలీవుడ్ లో నిలబడటానికి రానా చేస్తున్న ఈ నేనె రాజు నేనే మంత్రి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యిందో, డైరెక్టర్ తేజ, రానాని నిలబెట్టి... అదే టైం లో తాను కూడా టాలీవుడ్ లో నిలబడడానికి ఈ రాజు, మంత్రి కథ ఎంతవరకు హెల్ప్ అయ్యిందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ:
నేనే రాజు నేనే మంత్రి కథ మొత్తం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోనే ఉంటుంది. రానా, జోగేంద్రగా జైలుకెళ్ళడంతో మొదలైన సినిమా రానా జీవితంలో జరిగిన సంఘటనలతో ముందుకెళుతోంది. జోగేంద్ర(రానా) చిన్న చిన్నవ్యాపారాలు చేస్తూ భార్య రాధ (కాజల్)తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. జోగేంద్రకి రాజకీయాలంటే విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తితోనే జోగేంద్ర గ్రామ సర్పంచ్ గా పోటీ చెయ్యడానికి సిద్దమవుతాడు. అందులో భాగంగా ఒకసారి రాజకీయనాయకుడైన ప్రదీప్ రావత్ తో తలపడాల్సి వస్తుంది. ఇక రాజకీయాల్లో తనకి అన్ని రకాలుగా ఉపయోగపడే వ్యక్తి నవదీప్ ని జోగేంద్ర తన అసిస్టెంట్ గా పెట్టుకుంటాడు.హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేస్తారు. జోగేంద్ర రాజీకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ బలమైన రాజకీయనాయకుడిగా అవతరిస్తాడు. కొన్ని కారణాల వలన జోగేంద్ర కాస్తా రాధా జోగేంద్రగా మారిపోతాడు. రాజకీయాల్లో రాణి(కేథరిన్) జోగేంద్రకి సహాయం చేస్తుంటుంది. అలాగే పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా, తనికెళ్ళ భరణి కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకుని అక్కడ మంత్రులందరికీ మొగుడుగా మారతాడు. అక్కడినుండి హోమ్ మినిష్టర్ కి జోగేంద్రకి అస్సలు పొసగదు. జోగేంద్రకి సీఎం కుర్చీ మీద కన్ను పడుతుంది. అయితే రాజకీయాల్లో ఎదిగిన జోగేంద్రకి, రాజకీయాలవల్లనే డబ్బు పరపతిని పోగొట్టుకుని తన స్వగ్రామం వెళ్ళిపోతాడు. అక్కడ భార్య రాధాకిచ్చిన మాట ప్రకారం రాజకీయాలకు దూరమవుతున్న క్షణంలోనే..... అనూహ్యంగా జోగేంద్ర భార్య రాధాకిచ్చిన మాట పక్కన పెట్టి బలమైన రాజీకయ నాయకుడిగా మారుతాడు. అసలు జోగేంద్ర ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాడా? జోగేంద్ర రాజీకయ ఎదుగుదలలో నవదీప్ పాత్ర ఎంత? ఒక ఛానల్ కి ఓనర్ అయిన రాణి, జోగేంద్రకి ఎందుకు సహాయం చేస్తుంది.? భార్య రాధని ఎంతగానో ప్రేమించిన జోగేంద్ర ఆమెకిచ్చిన మాట ఎందుకు తప్పుతాడు? ఇవన్నీ తెలియాలి అంటే నేనే రాజు నేనే మంత్రి సినిమాని వెండితెర మీద వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు:
జోగేంద్రగా రానా అద్భుతమైన నటన కనబరిచాడు. భర్త గా, పొలిటికల్ లీడర్ గా బాగా ఆకట్టుకున్నాడు. బాహుబలి, ఘాజీ వంటి డిఫరెంట్ మూవీస్ చేసిన రానా, లీడర్ తర్వాత చేసిన పొలిటికల్ జోనర్ మూవీ ఇది. సామాన్య వడ్డీ వ్యాపారి సీఎం కావాలనుకున్నప్పుడు అతను ఎదిగే క్రమం, అందులో అతను ఎదుర్కొనే సమస్యలు.... పొలిటికల్ లీడరకుండాల్సిన పంచ్ డైలాగ్స్.... చిన్న రాజకీయనాయకుడు బలమైన రాజకీయనాయకుడిగా ఎదిగే క్రమంలో రానా చూపించిన నటన అద్భుతమనే చెప్పాలి. అలాగే రానా పంచెకట్టుతో అదరగొట్టేసాడు. ఆ బాడీ లాంగ్వేజ్ లోని వేరియేషన్స్ అన్ని ఆకట్టుకునేలా వున్నాయి. నాకు నేనే రాజుని నాకు నేనే మంత్రిని అంటూ రానా చెప్పిన డైలాగ్ డెలివరీ కూడా బావుంది. ఇక హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ గురించి ఏం చెప్పాలి. ఆమె గురించి నేనే రాజు నేనే మంత్రి ఫస్ట్ లుక్ బయటికి వచ్చినప్పటినుండి ఆమె గురించిన టాక్ అంతా పాజిటివ్ గానే వినబడుతుంది. ట్రెడిషనల్ లుక్ లో చీర కట్టు, పెద్ద బొట్టు అచ్చమైన గృహిణి ఎలా ఉంటుందో అలా కనిపించి ఆకట్టుకుంది. ఇక కాజల్ అగర్వాల్ తో రానా చేసిన రొమాంటిక్ సీన్స్ అన్ని సూపర్బ్ అనేలా ఉన్నాయి. మరో హీరోయిన్ కేథరిన్ కూడా అల్ట్రా మోడ్రెన్ అమ్మాయిలా అదరగొట్టేసింది. మందు, దమ్ము కొడుతూ గ్లామర్ షో చేసింది. అలాగే రానాకీ కుడి భుజంగా నవదీప్ కూడా ఫస్ట్ హాఫ్ లో బాగా కట్టుకున్నాడు. తనికెళ్ళ భరణి సీఎం గా తనదైన నటనలో మెప్పించాడు. పోలీస్ ఆఫీసర్ గా అజయ్, హోమ్ మినిష్టర్ గా, విలన్ గా అశుతోష్ రానా తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు. ప్రభాస్ శ్రీను, బిత్తిరి సత్తీలు కమెడియన్స్ గాఆకట్టుకున్నారు,.
సాంకేతిక వర్గం పనితీరు!!
డైరెక్టర్ తేజ ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా అడుపెట్టినప్పటినుండి ప్రేమ కథలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడు. కేవలం ఆ లవ్ స్టోరీస్ తోనే హిట్స్ కూడా కొట్టాడు. అలాగే కొన్ని సినిమాలు సమాజానికి ఉపయోగపడేలా ఏదోఒక మెస్సేజ్ ఇవ్వాలనే తలంపుతోనే తెరకెక్కించాడు. అందులో మహేష్ బాబుతో చేసిన నిజం చిత్రం ఒకటి. కానీ కొన్ని చిత్రాలను మాత్రం తలా తోక లేకుండా తీసి చివరికి ఇండస్ట్రీకి దూరమయ్యే పరిస్థితి కూడా తెచ్చుకున్నాడు తేజ. అయితే ఇప్పుడు తన గత చిత్రాలన్నిటికన్నా భిన్నంగా చేసిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. రానా ని హీరో గా చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తేజ ఈ చిత్రంలో పూర్తి స్థాయి రాజకీయాలను టచ్ చేసాడు. ఐదేళ్ల కాలంలో ఓ వ్యక్తి తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించాడన్నదే నేనే రాజు నేనే మంత్రి కథ. ఒకపక్క పొలిటికల్ గా సీరియస్ కొనసాగుతున్నకథ, రొమాంటిక్ యాంగిల్ ని టచ్ చెయ్యడం వంటివి కొత్తగా వున్నాయి. కామెడీకి కూడా అక్కడక్కడా చోటిచ్చినా, ఈ చిత్రంలో కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. స్క్రీన్ప్లే పరంగా క్లారిటీతో నేనే రాజు నేనే మంత్రి సాగుతుంది. ఆలాగే అనూప్ రూబెన్స్ అందించిన కొన్ని సాంగ్స్ ఆకట్టుకునేలా వున్నాయి. జోగేంద్ర టైటిల్ సాంగ్, మాంటేజ్ సాంగ్స్ ఒకే ఒకే అనిపించాయి. ఇక అనూప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరగొట్టేసాడు. వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫీ బావుంది. సినిమాలోని సన్నివేశాలను ఎంతో అందంగా తెరకెక్కించాడు. లక్ష్మీభూపాల్ మాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. కొన్ని డైలాగ్స్ సినిమాలో బాగానే పేలాయి. నిర్మాణ విలువలకు ఎక్కడా వంక పెట్టడానికిలేదు.
వివరణ:
తేజ ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకొచ్చినట్టే అనిపిస్తుంది.... నేనే రాజు నేనే మంత్రి చూస్తుంటే. హీరో హీరోయిన్స్ నుండి తనకు కావాల్సిన అవుట్ ఫుట్ ని రాబట్టుకోగలిగాడు. ఎప్పుడూ కొత్తవారితో ప్రయోగాలు చేసే డైరెక్టర్ తేజ ఈసారి మాత్రం నేనే రాజు - నేనే మంత్రి కోసం మాత్రం అందరూ సీనియర్ స్టార్స్ నే ఎంచుకున్నాడు. వీరందరూ ఇప్పటివరకు బోలెడన్ని సినిమాల్లో నటించిన వారే. కొత్తనటీనటులతో కుస్తీపట్టే తేజ ఈసారి మాత్రం సీనియర్ నటులతోనే సైలెంట్ గా కూల్ గా పనికానిచ్చేసి రెండు సినిమాల మీద పోటీకి దిగిపోయాడు. భారీ బడ్జెట్ కాకుండా మినిమమ్ బడ్జెట్ తోనే తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి సినిమాకి విపరీతమైన హైప్ రావడంతో సినిమాకి మంచి బజ్ వచ్చేసింది. నిర్మాతలు సురేష్ బాబుకి, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి ఈ చిత్రం బోలెడంత లాభాలు తెచ్చిపట్టింది. సినిమా విడుదలకు ముందే నిర్మాతలు లాభాలు మూటగట్టుకున్నారు. ఇక సోలోగా రానాకీ ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రానా కాజల్ తో చేసిన రొమాన్స్ నేనే రాజు నేనే మంత్రి సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనడంలో సందేహంలేదు.
ప్లస్ పాయింట్స్: రానా నటన, కాజల్ చీరకట్టు అందాలు, పొలిటికల్ డైలాగ్స్, కేథరిన్ అందాలు, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్: కామెడీ, కథలో కొత్తదనం లేకపోవడం, రానా..నవదీప్ ని చంపెయ్యడం, ట్విస్టులు లేకపోవడం, సెకండ్ హాఫ్, క్లైమాక్స్
రేటింగ్: 3/5