బాబు బంగారం మూవీ రివ్యూ
నటి నటులు: వెంకటేష్, నయనతార, పృథ్వీ, బ్రహ్మానందం
సంగీతం: జిబ్రాన్
నిర్మాతలు: ఎస్.నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్
రచన, దర్శకత్వం: మారుతి
రేటింగ్ : 2.0/ 5
గత చిత్రాలకు బూతు డైరెక్టర్ గా పేరు మోసిన మారుతి కి భలే భలే మగాడివోయ్ రిలీజ్ అయ్యే వరకు డైరెక్టర్‌గా సరైన పేరు లేదు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆ చిత్రం అందర్నీ ఆకట్టుకోవడం తో మారుతీ కి మంచి గుర్తింపు వచ్చింది. మతిమరుపు అనే ఓ బలహీనతపై భలే భలే మగాడివోయ్ చిత్రాన్ని తీసి ఆద్యంతం ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేసిన మారుతి మనిషిలోని మంచితనం, జాలి అనే మరో బలహీనతని తీసుకొని మరోసారి ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలని ప్రయత్నించాడు. విక్టరీ వెంకటేష్ ని హీరో గా పెట్టి ఇంతకు ముందే మారుతి సినిమా తియ్యలనుకున్నాడు.. కానీ కుదరక మల్లి ఇప్పుడు వెంకీ హీరోగా బాబు బంగారం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి మారుతి భలే భలే మగాడివోయ్ చిత్రం లాగా ఫామిలీ ఎంటర్టైన్ చేశాడా లేక పాత కథలాగే బూతు సినిమాలా తీసాడా... వెంకటేష్‌లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్‌ని మారుతి ఎంతవరకు ఉపయోగించుకున్నాడు? ఆ ఎంటర్టైన్మెంట్కి ఆడియన్స్ ఎంతవరకు కనెక్ట్ అయ్యారు? అనేది సమీక్షలో తెలుసుకోవాల్సిందే.
కథ: ఎవరిని కష్టాల్లో వున్నా జాలి పడి వాళ్లకు ఏదన్నా సహాయం చేయాలనుకునే మనస్తత్వం కలిగిన కృష్ణ (వెంకటేష్) ఒక పోలీస్ ఆఫీసర్. పోలీస్ఎ అయ్యివుంది కూడా దొంగలను చూసి కూడా జాలి పడుతుంటాడు కృష్ణ. హీరోయిన్ శైలజ(నయనతార) పడే కష్టాన్ని చూసి ఎప్పటిలాగే బాధపడతాడు. ఆమెను అన్నివిధాలా ఆదుకుంటాడు. నెలరోజులు సెలవు పెట్టి ఆమె వెన్నెంటే వుంటాడు. తానే శైలజని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. శైలజ తండ్రి శాస్త్రి(జయప్రకాష్)ని పోలీసులు వెతుకుతుంటారు. దాంతో అతను అండర్‌గ్రౌండ్‌కి వెళ్ళిపోతాడు. అతని ఆచూకీ చెప్పమని విలన్ గ్యాంగ్ శైలజను బెదిరిస్తూ వుంటుంది. శాస్త్రి తల్లి(షావుకారు జానకి)కి హార్ట్ ఎటాక్ రావడంతో ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆమెకు అర్జెంట్‌గా ఆపరేషన్ చెయ్యాలంటాడు డాక్టర్. తన కొడుకు వస్తేనే కానీ ఆపరేషన్ చేయించుకోనని పట్టుపడుతుంది అతని తల్లి. అయితే తనని చూస్తేనే తన తల్లి ఆపరేషన్ చేయించుకుంటుంది కాబట్టి ఎలాగైనా తన తల్లిని కలవాలనుకుంటాడు. శాస్తి తల్లిని కలిసే సమయానికి అతన్ని పోలీస్ లు అరెస్ట్ చేస్తారు. ఇదంతా కృష్ణ చేయించాడని శైలజ అనుకుంటుంది. మరి కృష్ణతో శైలజ తెగతెంపులు చేసుకుంటుందా లేక అసలు నిజం తెలిసి క్షమిస్తుందా అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే.
పనితీరు: ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చెయ్యడం లో మారుతీ తడబడ్డాడనే చెప్పొచ్చు. అసలు పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి... అనే దానిని సరిగా చూపించలేకపోయాడు. ప్రతిదానికి జాలిపడడం అనేది ప్రేక్షకుడు పూర్తిగా జీర్ణించుకోలేదు. ఒక హీరో అస్తామాను ఏడవడం అనేది అస్సలు నచ్చదు. మరి మారుతీ అసలేం ఆశించి వెంకీ కెరెక్టర్ ని మలిచాడో మారుతికి తెలియాలి. ఇక వెంకటేష్ నటన మాటకొస్తే వెంకీ కి ఇలా పోలీస్ ఆఫీసర్ పాత్రలు కొత్తకాదు. అయితే తన పాత్రకు వెంకీ న్యాయం చేసాడనే చెప్పాలి.నయనతార కి పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర ఏమి కాదు. ఇక ఫస్ట్ ఆఫ్ అంతా పృద్వి కోసమే తీసినట్టుంది. పూర్త్తి స్థాయిలో పృథ్వి ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసానే చెప్పొచ్చు. ఇక పోసాని, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ తమ పరిధిలో నటించారు. రిచర్డ్ ప్రసాద్ ఫోటోగ్రఫీ సినిమాకి మంచి రిచ్ లుక్‌ని తీసుకొచ్చింది. జిబ్రాన్ చేసిన పాటల్లో మూడు పాటలు ఆకట్టుకునేలా వున్నాయి. ఫారిన్ లొకేషన్స్‌లో తీసిన పాటలు విజువల్‌గా బాగున్నాయి. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్వాలేదనిపించింది. ఉద్దవ్ ఎడిటింగ్ కూడా ఫర్వాలేదు. ఫస్ట్ హాఫ్‌లో పృథ్వీకి మారుతి, డార్లింగ్ స్వామి రాసిన మాటలు బాగానే ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. అయితే అసలు కథలో పట్టులేకపోవడం ఈ సినిమాకి పెద్ద మైనసగా చెప్పుకోవచ్చు. ఓన్లీ పృథ్వి చేసిన ఎంటర్టైన్మెంట్ ఒకటే ఈ సినిమాకి కలిసొచ్చే అంశం. ఈ సినిమాలో ప్రొడక్షన్ వేల్యూస్ బాగున్నాయి. మేకింగ్ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. మరి ఈ సినిమాని ప్రేక్షకుల ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది కొంచెం ఆలోచించ దగ్గ విషయమే.
ప్లస్ పాంట్స్: వెంకటేష్ నటన, నయనతార లుక్, కమెడియన్ పృథ్వి
మైనస్ పాయింట్స్: దర్శకత్వం, కథ, కథనం, సెకండ్ హాఫ్