మనమంతా రివ్యూ
నటీనటులు: మోహన్‌లాల్, గౌతమి, విశ్వాంత్, ఊర్వశి మొ:వారు
సంగీతం: మహేష్ శంకర్
సమర్పణ: సాయిశివాని
నిర్మాత: సాయి కొర్రపాటి
రచన, దర్శకత్వం: చంద్రశేఖర్ యేలేటి
రేటింగ్: 3 .0/ 5
అప్పుడప్పుడు కొంతమంది డైరెక్టర్లు కొత్త ఆలోచనలతో, కొత్త కథలతో, కొత్త తరహా సినిమాలు చెయ్యడానికి ట్రై చేస్తుంటారు. వాటిలో కొన్ని ప్రేక్షకాదరణ పొంది కమర్షియల్‌గా పెద్ద హిట్స్ అయితే, మరికొన్ని కమర్షియల్‌గా సక్సెస్ అవ్వకపోయినా మంచి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఎప్పుడూ ఫార్ములా జోలికి వెళ్ళకుండా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తమ పంథాని మార్చుకోకుండా సినిమాలు తీసే డైరెక్టర్లు కొందరున్నారు. వారిలో చంద్రశేఖర్ యేలేటి ఒకరు. ఇప్పటివరకు అతను చేసిన సినిమాలు తక్కువే. చంద్రశేఖర్ యేలేటి సినిమా వస్తుందంటే కొంతమంది ప్రత్యేకం గా ఎదురు చూస్తూ వుంటారు. అలా అందరూ ఎదురుచూసిన సినిమా మనమంతా. దాదాపు 22 సంవత్సరాల తర్వాత మలయాళ హీరో మోహన్‌లాల్ తెలుగులో డైరెక్ట్ గా చేసిన సినిమా ఇది. అలానే ఈ సినిమా నాలుగు కథలు ఈఆధారం తో తెరకెక్కించబడింది. అయితే ఆ నాలుగు కథల్ని ఎలా చెప్పాడు? ప్రేక్షకుల్ని ఎలా మెప్పించాడు? అనేది పాయింట్. మరి ఆ కత్తలను సినిమా కింద మలిచి ఎలా తెరకెక్కించాడు అనేది సమీక్ష లో తెలుసుకుందాం.
అసలు కథగా చెప్పాలంటే సాయిరామ్, గాయత్రి, మహిత, అభి అనే నలుగురి కథలకు సంబందించినది ఈ మనమంతా సినిమా. మరి ఆ ఖాతాల్లోకి వెళ్లి ఒకసారి చూద్దామా.
మొదటి కథ: ఒక సూపర్ మార్కెట్లో చిన్న స్థాయిలో పనిచేసే ఉద్యోగిగా జాయిన్ అయ్యి సాయిరామ్(మోహన్‌లాల్) చాలా సంవత్సరాలుగా అదే సూపర్ మార్కెట్లో పనిచేస్తూ అసిస్టెంట్ మేనేజర్‌గా ఎదిగాడు. అతనితోపాటు మరో అసిస్టెంట్ మేనేజర్‌గా విశ్వనాథ్(హర్షవర్థన్) పనిచేస్తుంటాడు. అయితే వీరిద్దరిలో ఒకరికి మేనేజర్ అయ్యే ఛాన్స్ వస్తుంది. మరి ఛాన్స్ రావడానికి ఎవరు ఎన్ని ఎత్తులు వేశారు... ఇంకా ఎన్ని కుట్రలు చేశారు అనేదే మొదటి కథ.
రెండో కథ: గాయత్రి(గౌతమి) ఓ మధ్య తరగతి స్త్రీ . పొదుపుగా ఇంటిని ఎలా మేనేజ్ చెయ్యాలి..అని తెగ ఆలోచిస్తూవు ఉంటుంది. ఎక్కడికెళ్తే ఎక్కడ తక్కువ ధరలకు వస్తువులు కొనొచ్చా అని చూస్తూ ఉంటుంది. ఆమె చదువుకునే రోజుల్లో ఒకాయనికి రెండొందలు అప్పు ఇస్తుంది. ఇక ఆయన ఆ అప్పు ఇవ్వలేకపోతాడు. చాలా రోజుల తర్వాత వచ్చి ఆమెకి ఇచ్చేద్దామనుకుంటే గాయత్రీ మాత్రం ఇంట్రెస్ట్ కలిపి ఇవ్వాలని అడుగుతుంది. నువ్వు డబ్బు సహాయం చెయ్యడం వాళ్ళ నేను చాలా లాభపడ్డానని ఏం కావాలో కోరుకోమంటాడు. మరి దీనికి గాయత్రీ ఒప్పకుంటుందా లేక తన డబ్ తనకి కావాలి అని అడుగుతుందా అనేది రెండో కథలో చూపించాడు దర్శకుడు.
మూడవ కథ: (రైనారావు) ఏడో తరగతి చదివే అమ్మాయి. ఈమెకు సేవా గుణం ఎక్కువ. ఎవరు బాధపడుతున్నా చూడలేదు, సాయం చేయకుండా వుండలేదు. అలాంటి మహతికి మురికి వాడలో వుండే వీర్‌శంకర్ అనే నాలుగేళ్ళ కుర్రాడు ఫ్రెండ్ అవుతాడు. అతన్ని తమ్ముడిలా ప్రేమగా చూసుకుంటుంది. అతన్ని స్కూల్లో కూడా చేర్పిస్తుంది. ఓరోజు ఆ అబ్బాయి తప్పి పోతాడు. వీర్‌శంకర్‌ని వెతకడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేస్తుంది మహతి. పిల్లలందరితో వీర్‌శంకర్ వివరాలు పేపర్‌పై రాయించి వాటిని అందరికీ పంచుతుంది. కానీ, అతని జాడ కనిపించదు. మరి వీర్‌శంకర్ ఎక్కడున్నాడో మహతి కనిపెట్టగలిగిందా? అనేదే మూడవ కథ.
నాలుగోవ కథ: అతని పేరు అభిరామ్(విశ్వాంత్) బి.టెక్ చదువుకునే కుర్రాడు. క్లాస్‌లో అందరి కంటే ఇంటెలిజెంట్ స్టూడెంట్. అతనికి చదువు తప్ప మరో ధ్యాస లేదు. అలాంటి అభిరామ్ జీవితంలోకి ఐరా(అనీషా ఆంబ్రోస్) అనే అమ్మాయి ప్రవేశించింది. దాంతో అతని లైఫ్ చదువు ట్రాక్ తప్పి లవ్ ట్రాక్ ఎక్కింది. అయితే ఆమె మాత్రం ఇతన్ని ఫ్రెండ్ గానే భావిస్తుంది. మరి అభి... ఐరాకి లవ్ ప్రపోజ్ చేస్తాడా... చేస్తే ఐరా ఎలా రిసీవ్ చేసుకుంటుంది అనేది నాలగవ కథ.
మరి నలుగురి సమస్యలకు పరిష్కారం ఏమిటి? అని మనం ఆలోచిస్తున్న టైమ్‌లోనే ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.ఇక సెకండాఫ్‌లో డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.
పనితీరు: నటుడుగా మోహన్‌లాల్ ఈ సినిమాలో జీవించాడనే చెప్పాలి. జాతీయ స్థాయి ఉత్తమనటుడుగా ఎన్నో అవార్డులు అందుకున్న మోహన్‌లాల్ సాయిరామ్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకొని ఆ క్యారెక్టర్‌కి మరింత అందాన్ని తీసుకొచ్చాడు.ఇక మధ్య తరగతి ఇల్లాలిగా గౌతమి కూడా తన పాత్రలో జీవించింది. మహతిగా చిన్నారి రైనారావు నటన అందరికీ కంటతడి పెట్టిస్తుంది. ప్రతి సీన్లో ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. గొల్లపూడి మారుతిరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, హర్షవర్థన్, అనీషా ఆంబ్రోస్ తమ తమ క్యారెక్టర్లకు న్యాయం చేశారు. ఇక రాహుల్ శ్రీవాత్సవ్ ఫోటోగ్రఫీ ఎంతో నేచురల్‌గా అనిపిస్తుంది. మహేష్ శంకర్ చేసిన పాటలు బాగానే వున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కథకి తగ్గట్టుగా బాగా చేశాడు. చంద్ర శేఖర్ యేలేటి ఎంతో కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించాడు. ప్రతి ఒక్క నటుడికి ఇంపార్టెంట్ వున్నా పాత్రలను ఇచ్చి సినిమాని తెరకెక్కించాడు. మనం నిజం గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగే ప్రతిఒక్క సంఘటనను ఈ సినిమాలో మనకి కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు.
ప్లస్ పాయింట్స్: కథనం, స్క్రీన్‌ప్లే, నటీనటులు, దర్శకత్వం, ఫోటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: కథ, పాటలు