Mon Nov 25 2024 23:31:27 GMT+0000 (Coordinated Universal Time)
మన్యం పులి మూవీ రివ్యూ
నటీనటులు: మోహన్ లాల్, కమలిని ముఖర్జీ, జగపతి బాబు
సంగీతం : గోపి సుందర్
నిర్మాత : కృష్ణా రెడ్డి
దర్శకత్వం : వైశాఖ్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా మలయాళం లో తెరకెక్కిన సినిమా ‘పులి మురుగన్’. మలయాళంలో సూపర్ హిట్ అయ్యి దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ‘పులి మురుగన్’ సినిమా ఇక్కడ తెలుగులో 'మన్యం పులి' గా ఈ రోజుప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'జనతా గ్యారేజ్, మనమంతా' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచయమైన మోహన్ లాల్ ఇక్కడ మంచి పాపులారిటీ సంపాదించాడు. ఇక ఇప్పుడు మోహన్ లాల్ సోలో హీరోగా...తెలుగు హీరో జగపతిబాబు విలన్ గా నటించిన ఈ సినిమాలో ఆనంద్, గోదావరి సినిమాల ఫేమ్ కమలిని ముఖర్జీ మోహన్ లాల్ పక్కన జంటగా నటించిన ఈ మన్యం పులి చిత్రం ప్రేక్షకులని ఎంతమేర ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: అటవీ ప్రాంతానికి దగ్గర్లో ఉండే ఓ గ్రామం లో నివాసముంటుంటాడు లారీ డ్రైవర్ కుమార్ (మోహన్ లాల్). ఇక పులులతో పోరాడగలిగే శక్తితో, నేర్పరితనం తో ఉంటాడు నరసింహ. ఒక పులి నుండి ఆ గ్రామాన్ని కాపాడడమే కుమార్ కి ముఖ్యమైన పని. అందుకే కుమార్ ని అందరు మన్యం పులి అంటారు. అయితే కుమార్ అనుకోకుండా డ్రగ్ కేసులో ఇరుక్కుంటాడు. అప్పుడు కుమార్ ఊరు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ క్రమం లో ఒక పులి ఆ గ్రామంలో భీబత్సం సృష్టిస్తుంది. ఇక ఆ గ్రామం వదిలేసి వచ్చిన కుమార్ కి జగపతిబాబు కి ఎందుకు గొడవలు అయ్యాయి? ఇక మనుషుల్ని తినే పులి నుండి ఆ గ్రామస్తులని కుమార్ ఎలా కాపాడాడు? అనేవి తేరా మీద తెలుసుకోవాల్సిందే.
పనితీరు: మోహన్ లాల్ పులి ని వేటాడే ధీరుడుగా చాల బాగా కనిపించాడు.. పులి తో సైతం పోరాడేటప్పుడు కళ్ళల్లో ఎలాంటి బెదురూ కనిపించకుండా మంచి హావభావాలని చూపించాడు. తెలుగులో సోలో గా వచ్చిన మోహన్ లాల్ కి ఈ సినిమాతో ఇక్కడ కూడా మలయాళంలో వచ్చిన స్టార్ డమ్ వచ్చేస్తుంది. కమిలిని ముఖర్జీ చాల రోజుల తర్వాత తెలుగులో కనిపించి తన అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. డీ గ్లామర్ పాత్రలో కమలిని మెప్పించింది. గ్రామీణ యువతి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. జగపతి తనదైన శైలి లో విలన్ గా అందర్నీ ఆకట్టుకున్నాడు..మిగితా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు వైశాఖ్ ఈ సినిమాని పూర్తిగా ప్రేక్షకులకు చేరువయ్యాయేలా తీర్చి దిద్దాడు. ముఖ్యంగా పది నిమిషాల నిడివిగల పులి ఫైట్ ని చాల అద్భుతంగా చిత్రీకరించాడు. మేకింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాడని షాట్స్ పెట్టె విధానం చూస్తే తెలుస్తుంది.. ప్రతి పాత్రను యూస్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు.. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విషయాల్లో టెక్నిషియన్స్ మంచి ప్రతిభని కనపరిచాడు.. విసువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకున్నాయి.. మ్యూజిక్ విషయంలో గోపి సుందర్ మంచి మార్కులు కొట్టేశాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.
ప్లస్ పాయింట్స్: మోహన్ లాల్, ఫైటింగ్స్, షాజీ కుమార్ కెమెరా, గోపి సుందర్ మ్యూజిక్, క్లైమాక్స్
మైనస్ పాయింట్స్: కామెడీ, రొమాన్స్, కథ, సెకండ్ హాఫ్
రేటింగ్: 2 .5 / 5
Next Story