మరకతమణి మూవీ రివ్యూ...
తెలుగులో అరకొర కనిపించే ఆది పినిశెట్టి ఇప్పుడు వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. 'మలుపు' సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న ఆది ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి ప్రతి కథానాయకుడిగా కూడా చలామణి అవుతున్నాడు. 'సరైనోడు' చిత్రంలో హీరో అల్లు అర్జున్ అంతటి పవర్ ఫుల్ కేరెక్టర్ లో కనబడిన ఆది పినిశెట్టి ఆ చిత్రంలో విలన్ గా మంచి మార్కులే కొట్టేసాడు. అలాగే 'మలుపు' సినిమాలో కూడా ముగ్గురు స్నేహితులను కాపాడే కేరెక్టర్ లో బాగా మెప్పించాడు. ఇక అదే 'మలుపు' సినిమాలో జోడిగా నటించిన ఆది పినిశెట్టి - నిక్కీ గర్లాని మరోసారి జోడీకడుతున్న చిత్రం 'మరకతమణి'. ఒక విభిన్న కధాంశంతో తమిళంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మన తెలుగు నటులు కోట శ్రీనివాస్ రావు, బ్రహ్మనందం వంటి వారు నటించడంతో ఈ చిత్రంపై అందరికి ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా ఈ సినిమా కి విపరీతమైన పబ్లిసిటీ చెయ్యడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. మరి ఆది పినిశెట్టి, నిక్కీ గర్లానిల జంట ప్రేక్షకుల అంచనాలు ఏ మాత్రం అందుకుందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: అప్పులతో విసిగి వేసారి పోయిన రఘునందన్ (ఆది పినిశెట్టి) సీటికి వెళ్లి రౌడీలా మారి అందరిదగ్గరనుండి డబ్బులు వసూలు చేస్తూ తనకున్న అప్పులు తీర్చుకోవాలని ప్లాన్ చేస్తాడు. అందులో భాగంగానే చిన్న చిన్న దొంగతనాలు చేసి రౌడీలా మారదామనుకుంటాడు. కానీ అలా చెయ్యలేకపోతాడు. కారణం అతనికున్న సిగ్గు, మొహమాటమే కారణం. అదే సమయంలో తన లవర్ వేరే అతన్ని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంది. ఆ లవర్ ఎవరో కాదు అలేఖ్యనే. ఒకప్పుడు రఘు, అలేఖ్య ( నిక్కీ గర్లాని) తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతాడు. ఎప్పుడైతే అతను డాన్ గా మారాలనుకుంటాడో అప్పుడు అలేఖ్య వేరే అతన్ని పెళ్లి చేసేసుకుంటుంది. దీనితో బాగా అవమానపడ్డ రఘునందన్ తక్కువ టైం లో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఒక డేరింగ్ డాషింగ్ నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయమే ప్రాణాలకు పోరాడి 'మరకతమణి' ని తీసుకురావడం. అసలు 'మరకతమణి' ని సంపాదించే క్రమంలో చాలామందే ప్రాణాలు కోల్పోతారు. అయినా భయపడకుండా రఘునందన్ 'మరకతమణి' ని తెచ్చి ఇచ్చేందుకు కొందరితో డీల్ సెట్ చేసుకుంటాడు. అసలు మరకతమణి కథ ఏమిటి? రఘునందన్ ని అలేఖ్య ఎందుకు కాదంటుంది.? ఆమె వేరెవరినో పెళ్లి చేసుకోవడానికి కారణం ఏమిటి? మరకతమణి ని తెచ్చే క్రమంలో రుఘునందన్ ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తాడు? ఇవన్నీ తెలియాలంటే మరకతమణి చిత్రాన్ని వెండితెర మీద వీక్షించాల్సిందే.
నటీనటుల పనితీరు: ఆది పినిశెట్టి మరోసారి తన అద్భుతమైన నటనతో రఘునందన్ గా ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో ఆది నటన సూపర్బ్ గా వుంది. రఘునందన్ పాత్రకి ఆది అతికినట్లు సరిపోయాడు. చాలా సీన్స్ లో ఆది నటన అదిరిందనే చెప్పాలి. అలాగే నిక్కి గల్రాని గ్లామర్ పాత్ర కాకుండా డిఫరెంట్ పాతల్రో కనపడుతుంది. నటన పరంగా మంచి మార్కులే కొట్టేసింది. ఇక కోటా శ్రీనివాస్ రావు కి, బ్రహ్మనదానికి పెద్ద ప్రాముఖ్యత లేకపోయినా ఉన్నంతలో మెప్పించారు. అలాగే అనంత్‌రాజ్ సహా అందరూ తమ వంతుగా సినిమాను సీరియస్‌గా కాకుండా కామెడి స్టయిల్లో ముందుకు వెళ్లేలా చూశారు.
సాంకేతిక వర్గం పనితీరు: దర్శకుడు ఎ.ఆర్.కె.శరవణన్ ఒక విభిన్న కధాంశాన్ని ఎంచుకుని ప్రేక్షకులను మెస్మరైజ్ చెయ్యడానికి వచ్చాడు. అయితే కథని బలంగా నమ్మిన దర్శకుడు స్క్రీన్ ప్లే విషయంలో కాస్త తడబడ్డాడు. ఇక సినిమాలో రొమాన్స్ కూడా అంతగా పండలేదు. ఎక్కువగా ఎమోషనల్ సన్నివేశాలే కనబడతాయి. అలాగే సినిమలో ఎక్కువగా తమిళ నెటివిటీ కనపడుతుంది. కాబట్టి సినిమా తెలుగు ప్రేక్షకులకు ఆట్టుకుంటుందా అనే విషయంలో సందేహం వస్తుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఈ చిత్రంలో పాటలకు స్థానం లేదు. కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. కొన్ని సస్పెన్స్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని బాగా పెంచింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. ఎక్కువ ఛేజింగ్ సీన్స్ ని , కొన్ని సస్పెన్స్ సీన్స్ లో సినిమాటోగ్రఫీ చాలా బావుంది. మరకతమణి కి సినిమాటోగ్రఫీ హైలెట్. అయితే ఈ చిత్రం విభిన్న కధాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రం మంచి కామెడీతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందనడంలో ఏమత్రం సందేహం లేదు.
ప్లస్ పాయింట్స్: స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, ఆది పినిశెట్టి నటన, నిక్కీ, డార్క్ కామెడీ, సెకండ్ హాఫ్, బ్యగ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్: తమిళ నేటివిటీ, ఫస్ట్ హాఫ్, నటులు కొత్తవారు కావడం, రొమాన్స్, ఎడిటింగ్
రేటింగ్: 2.75 /5