రాధా మూవీ రివ్యూ
నటీనటులు: శర్వానంద్, లావణ్య త్రిపాఠి, అక్ష, రవికిషన్, ఆశిష్ విద్యార్థి, కోట శ్రీనివాసరావు
మ్యూజిక్: రధన్
నిర్మాత: బోగవల్లీ బాపినీడు
దర్శకత్వం: చంద్రమోహన్
శర్వానంద్ ఈ మధ్యన హిట్స్ తో దూసుకుపోతున్నాడు. 'రన్ రాజా రన్' అంటూ పరుగును మొదలు పెట్టిన ఈ హీరో 'శతమానంభవతి' వరకు సూపర్ హిట్స్ కొట్టుకుంటూ పోతున్నాడు. శర్వానంద్‌కి ఎక్కువ హిట్లు లేవేమో కానీ అతనికి మంచి టేస్ట్ ఉందనేది చాలాసార్లు ప్రూవ్ అయింది. ఇప్పుడిప్పుడే రేంజ్ పెంచుకుంటోన్న శర్వానంద్ మరోసారి ఒక మంచి వినోదాత్మక చిత్రంతో మన ముందుకి వచ్చాడు. ఈ ఏడాది 'శతమానంభవతి' వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వచ్చిన శర్వా ఇప్పుడు మళ్ళీ ఒక యాక్షన్, రొమాంటిక్, ఎమోషనల్ కలగలిసిన 'రాధా' చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేసాడు. మొదటిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో చేస్తున్న శర్వానంద్ కామెడీతో బాగానే ఆకట్టుకునేలా ఉన్నాడని ట్రైలర్స్, పోస్టర్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ట్రెడిషనల్ లుక్ తో బాగానే ఆకట్టుకునేలా వుంది. చూద్దాం 'రాధ'తో శర్వా ఎలాంటి హిట్ ని అందుకోనున్నాడో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: చిన్నప్పటినుండి కృష్ణుడిని ఆరాధిస్తూ పెరిగిన రాధాకృష్ణ (శర్వానంద్) కి పోలీస్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. అందుకే క్రిమినల్స్ ని పట్టుకోవడానికి పోలీసులకి సహాయం చేస్తుంటాడు. అయితే రాధాకృష్ణ కి పోలీస్ అంటే వున్న ఆసక్తిని గమనించిన డిజిపి స్పెషల్ రిక్వెస్ట్‌తో రాధాకృష్ణకు ఎస్సై ఉద్యోగాన్ని ఇప్పించి బర్సాలపల్లెకు పోస్టింగ్ ఇప్పిస్తాడు. అక్కడ ఆన్ డ్యూటీలో ఉన్న రాధాకృష్ణ అదే ఊరిలో ఇంజినీరింగ్ చదువుతున్న రాధ(లావణ్య త్రిపాఠి) ని ప్రేమిస్తాడు. కొన్ని సంఘటనల వల్ల రాధ కూడా రాధాకృష్ణ ని ప్రేమిస్తుంది. వీరిద్దరూ ప్రేమించుకునే సమయంలో రాధాకృష్ణ కి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ రాధాకృష్ణ హైదరాబాద్ లో డ్యూటీలో జాయిన్ అవుతాడు. అదేసమయంలో రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీనే మళ్ళీ గెలవబోతున్నట్లు సర్వేలు చెబుతాయి. సీఎం రేసులో సూరిరెడ్డి(ఆశిష్ విద్యార్థి), సుజాత(రవికిషన్) పోటీ పడుతుంటారు. అయితే సూరిరెడ్డి ని కాదని సుజాతని హైకమాండ్ సీఎం అభ్యర్థిగా నిర్ణయిస్తుంది. అయితే అనుకోకుండా సీఎం అభ్యర్థి అయిన సుజాత మీద ఎటాక్ జరుగుతుంది. అక్కడ ప్రాణాలతో బయట పడ్డ సుజాత తన మీద జరిగిన ఎటాక్ కి పోలీసులే కారణమని చెబుతాడు. అసలు పోలీసులు సుజాత మీద ఎటాక్ కి ఎలా కారణమవుతారు? మరి పోలీస్ ల మీద పడిన నిందని రాధాకృష్ణ ఎలా తొలిగిస్తాడు? అసలు రాధాకృష్ణ కి ప్రేమించిన రాధతో పెళ్లవుతుందా? ఇవన్నీ తెలియాలంటే తెర మీద రాధని వీక్షించాల్సిందే.
నటీనటుల పాత్ర: శర్వానంద్, రాధకృష్ణ పాత్రలో బాగా మెప్పించాడు. మరోసారి ఎనేర్జిటిక్ రోల్ లో శర్వా ఇరగదీసాడు. వరుసగా నాలుగు విజయాలు సాధించిన శర్వానంద్ చేసిన అవుటండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనరే ఈ చిత్రం. లావణ్య త్రిపాఠి, అక్ష ఇద్దరు గ్లామర్ డాల్స్‌గా బాగా మెప్పించారు. లావణ్య త్రిపాఠి మాత్రం ట్రెడిషనల్ గా ఆకట్టుకుంది. విలన్‌గా నటించిన రవికిషన్ పొలిటీషియన్ పాత్రలో మెప్పించాడు. ఇక షకలక శంకర్ చేసిన కామెడీ మొదట్లో పర్వాలేదనిపించినా తర్వాత బోరు కొట్టించేస్తుంది. కోటశ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, షకలక శంకర్, బ్రహ్మాజీ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: ఇక డైరెక్టర్ చంద్రమోహన్ విషయానికొస్తే డెబ్యూ డైరెక్టర్ గా ప్రతిభ కనబర్చాడనే చెప్పాలి. కాకపొతే రాధా లాంటి రొటీన్ కథలు చాలానే వచ్చేసాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇలాంటి కథలను సినిమాగా చూడడానికి ప్రేక్షకులకి చాలా సహనం కావాలి. శర్వానంద్ ని ఎంత ఎనేర్జిటిక్ గా చూపించాలనుకున్నాడో అలాగే చూపించి సక్సెస్ అవ్వొచ్చు అనుకున్న డైరెక్టర్ పాయింట్ చాలా మంచిందే. అయితే దాని చుట్టూ అనుకున్న సన్నివేశాలు అనుకున్నంత స్థాయిలో బలంగా లేవు. సినిమాలో ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ గబ్బర్ సింగ్‌ను పోలి ఉంటే , సెకండాఫ్ రేసుగుర్రంలా ఉంది. విలన్‌ను హీరో బకరా చేసే సన్నివేశాలు, విలన్‌ను హీరో పగ తీర్చుకునే సన్నివేశాలు రేసుగుర్రంను తలపిస్తాయి. అలాగే క్లైమాక్స్ కూడా రేసుగుర్రం తరహాలోనే ఉంటుంది. చాలా వరకు సీన్స్ ఎక్కడో తెలుగు సినిమాలో చూసినట్లుగానే అనిపిస్తాయి. మ్యూజిక్ విషయానికొస్తే రధాన్ ట్యూన్స్ కొన్ని చోట్ల మెప్పించినా మరికొన్ని చోట్ల బోరింగ్ అనిపిస్తాయి. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అంతగా మెప్పించలేదు. కార్తీక్ చేసిన సినిమాటోగ్రఫీ బావుంది. ప్రతి సీన్‌ను చక్కగా ప్రెజంట్ చేశాడు.మధు ఎడిటింగ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది.
ప్లస్ పాయింట్స్: శర్వానంద్, లావణ్య త్రిపాఠి గ్లామర్, కొన్ని కామెడీ సీన్స్, రవి కిషన్, ఇంటర్వెల్ ట్విస్ట్
మైనస్ పాయింట్స్: మ్యూజిక్, కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, క్లైమాక్స్, సెకండ్ హాఫ్, ఎడిటింగ్
రేటింగ్: 2 .5 /5