సప్తగిరి ఎక్స్ ప్రెస్ రివ్యూ
రేటింగ్: 2.75 /5
స్టార్ కమెడియన్ గా సప్తగిరి టాలీవుడ్లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇప్పుడు హీరోగా ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ తో ఎంట్రీ ఇస్తున్నాడు. తిరుడన్ పోలీస్ అనే తమిళ హిట్ సినిమాకు రీ-మేక్ గా వచ్చిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ కి త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పవార్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం లో సప్తగిరికి జంటగా రోషిణి ప్రకాష్ జతకట్టనుంది. ఇప్పటికే కమెడియన్స్ గా వచ్చి హీరోలుగా సెటిల్ అయ్యి టాలీవుడ్ లో స్థిరపడిన వారు వున్నారు. మరి ఆ కమెడియన్స్ లాగా సప్తగిరి కూడా ఇండస్ట్రీలో హీరోగా పాతుకు పోతాడో లేక తన పాత రూట్ లోనే కమెడియన్ గా మిగిలి పోతాడో అనే విషయాన్ని ఈ సినిమా ని ఆదరించే ప్రేక్షకులపై ఆధారపడి వుంది. ఇక ఈ చిత్ర ఆడియోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అథితిగా హజవడం కూడా ఈ సినిమాపై ఒకింత ఆసక్థిని పెంచింది. అందులోను పవన్ సప్తగిరి ఎక్స్ ప్రెస్ చిత్రబృందాన్ని ఆశీర్వదించడంతో ఈ సినిమాపై అందరికి అంచనాలు ఏర్పడ్డాయి..ఇప్పటికే టీజర్స్ ట్రైలర్ తో అదరగొట్టిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో ఈ సమీక్షలో తెలుసుకోవాల్సిందే..
కథ : శివ ప్రసాద్ (శివ ప్రసాద్) ఓ నిజాయతీగల కానిస్టేబుల్. తన కొడుకు సప్తగిరి (సప్తగిరి)ని మాత్రం ఐఏఎస్ చేయాలని కళలు కంటాడు. అయితే సప్తగిరి మాత్రం తన తండ్రి ఆలోచనలకూ వ్యతిరేఖంగా సినిమాలూ, నాటకాలంటే పిచ్చి. సినిమా నటుడవ్వాలని కలలు కంటుంటాడు. ఈ క్రమం లోనే తమ కాలనీకి కొత్తగా వచ్చిన పూర్ణిమ (రోషిణి ప్రకాష్) వెంట పడుతుంటాడు. ఇదిలా ఉండగా సప్తగిరి తండ్రి శివప్రసాద్‌ని ఓ ఎన్కౌంటర్లో దారుణంగా చంపేస్తారు. ఇక తండ్రి చేసే ఉద్యోగం సప్తగిరికి వస్తుంది. ఆ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే తన తండ్రి మరణం వెనుక వున్నా వారిపై పగ తీర్చుకోవాలని తిరుగుతుంటాడు. మరి ఏ బాధ్యత లేకుండా తిరిగే సప్తగిరి ఒకేసారి పోలీస్ ఉద్యోగం లో ఎలా సెటిల్ అవుతాడు? తన తండ్రిని చంపినా వారిపై ఎలా పగ తీర్చుకుంటాడు? తాను వెంటపడిన అమ్మాయిని ప్రేమిస్తాడా? అనేవి తెలియాలంటే తెర మీద చూడాల్సిందే.
నటీనటులు: కమెడియన్ గా అందరిచే శెభాష్ అనిపించుకున్న సప్తగిరి ఈ సినిమాలో హీరోగా వినోదంతో పాటు అన్ని రకాలా ఎమోషన్స్ చక్కగా పలికించాడు.. కామెడీ ని ప్రధానంగా నమ్ముకుంటూనే కొన్ని ఎమోషన్స్ సీన్స్ లో మంచి ప్రతిభ కనపరిచాడు.. డాన్సులు, డైలాగులు , ఫైటింగులు చేసి ప్రేక్షకుడిని బాగానే అలరించాడు.. షకలక శంకర్ పాత్ర సినిమాలో కీలక పాత్రగా అనిపిస్తుంది. హీరో తో పాటు సమానంగా షకలక శంకర్ అందర్నీ అలరించాడు.. హీరోయిన్ పాత్ర కొద్దిసేపే అయినా తన పాత్రకి న్యాయం చేస్తుందనే చెప్పాలి..తండ్రిగా శివ ప్రసాద్ నటనలో, ఆయన పాత్రలో ఒదిగిపోయాడు. మిగితా పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు..
సాంకేతిక విభాగం: దర్శకుడు అరుణ్ పవర్ కృషి ఈ సినిమా అవుట్ ఫుట్ చూస్తే తెలుస్తుంది.. కథ దగ్గర్నుంచి మేకింగ్ వరకు అన్ని విషయాల్లో చాల చక్కటి ప్రతిభ కనబర్చాడు. తండ్రీ - కొడుకుల మధ్య ఎమోషనల్ సన్నివేశాలను బాగా పలికించగలిగాడు. సినిమా స్టోరీ పాతగా అనిపించినా పతాక సన్నివేశాల్లో అందర్నీ ఉత్కంఠకి గురిచేశాడు. కాకపొతే సెకండ్ హాఫ్ లో రివేంజ్ డ్రామా విషయంలో మరికొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటె ఈ చిత్రం పై టాక్ మరోలా ఉండేది. కామెడీ పరం గా పర్వాలేదనిపించారు. మ్యూజిక్ పర్వాలేదు. చిన్న సినిమా అయినా క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు నిర్మాత. అందుకే ప్రతీ సీన్ రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి.