'హలో' షార్ట్ & స్వీట్ రివ్యూ
అక్కినేని నవ మన్మథుడు అఖిల్ తొలి సినిమా అఖిల్ ప్లాప్ అవ్వడంతో రెండేళ్ల గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం హలో. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ సినిమాకు విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. అఖిల్ సరసన ప్రముఖ మళయాళ దర్శకుడు ప్రియదర్శన్, మాజీ హీరోయిన్ లిజి దంపతుల కుమార్తె కళ్యాణి హీరోయిన్గా పరిచయం అయ్యింది.
టీజర్లు, ట్రైలర్లు, ఆడియోతో ఆకట్టుకున్న హలో రూ.32 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. అఖిల్ లాంటి కొత్త హీరోకు తొలి సినిమా ప్లాప్ అయినా రెండో సినిమాకు ఈ రేంజ్లో బిజినెస్ జరిగిందంటే గొప్ప విషయమే. ఈ సినిమా హిట్‌పై ముందు నుంచి కాన్ఫిడెంట్‌గా ఉన్న అఖిల్ అండ్ హలో టీం ప్రమోషన్లతో హోరెత్తించారు. భారీ అంచనాల మధ్య ఈ రోజు వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ అయిన హలో ఇప్పటికే ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియర్ షో టక్ ప్రకారం సినిమా ఎలా ఉందో చూద్దాం.
అఖిల్ హలో సినిమాకు డిఫరెంట్ కథతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. దర్శకుడు విక్రమ్ కుమార్ కథలను ఎలా కొత్తగా తెరకెక్కిస్తాడో, తన స్క్రీన్ ప్లేతో ఎలా మెస్మరైజ్ చేస్తాడో ? ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. హలోలో మెయిన్ స్టోరీ కొంచెం రొటీనే అయినా విక్రమ్ ప్రతి సీన్లోనూ మ్యాజిక్ చేస్తాడు. పాతకథకు మెస్మరైజ్ స్క్రీన్ ప్లేతో కొత్తగా ప్రజెంట్ చేసిన తీరు బాగుంది. అఖిల్ చిన్నప్పటి సీన్లు, ఫ్యామిలీ ఎమోషన్లు, హీరో - హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్లు సినిమాకు మేజర్ హైలెట్.
ఇక యాక్షన్ సీక్వెల్స్‌లో అఖిల్ దుమ్ము రేపాడు. ఈ స్టంట్స్ కోసం అఖిల్ పడిన కష్టం మనకు తెరమీద స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సినిమాలో ఫస్టాఫ్ కొన్ని చోట్ల బోర్ అయినా సెకండాఫ్‌లో లవ్ సీన్లు సినిమా రేంజ్‌ను పెంచాయి. టెక్నికల్‌గా సినిమా హై రేంజ్లో ఉంది. నాగార్జున నిర్మాణ విలువలు, విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎక్స్లెంట్. అఖిల్ – కళ్యాణి ప్రియదర్శన్ జోడి చాలా బావుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను బాగా మెప్పిస్తుంది. పూర్తి రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగుపోస్ట్.కామ్