భరత్ అనే నేను ఫస్ట్ డే టీఎస్ అండ్ ఏపీ కలెక్షన్స్!
నిన్న శుక్రవారమే విడుదలైన భరత్ అనే నేను పాజిటివ్ టాక్ తో మహేష్ హిట్ కొట్టేసాడు. తనకి కొరటాల శివ మంచి హిట్ ఇస్తాడని మొదటి నుండి నమ్మిన మహేష్ కి తన నమ్మకం నిజమైంది. గత రెండు సినిమాల డిజాస్టర్ తో ఖంగుతిన్న మహేష్ కి భరత్ అనే నేను హిట్ మళ్ళీ నిలబెట్టింది. కైరా అద్వానీతో రొమాన్స్ చేసిన మహేష్ బాబు యంగ్ సీఎం గా అద్భుతమైన నటన ప్రదర్శించాడని, కొరటాల డైరెక్షన్ స్కిల్స్ అదుర్స్ అంటూ క్రిటిక్స్ ముక్త ఖంటంతో భరత్ కి ఫస్ట్ మార్కులు వేసేసారు. ప్రీమియర్స్ షోస్ కె హిట్ టాక్ వచ్చేసిన భరత్ అనే నేను మొదటి రోజు భారీగా రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్స్ లో విడుదలైన భరత్ ఏపీ మరియు టీఎస్ లలో మంచి కలెక్షన్స్ సాధించింది.
ఏరియాల వారీగా కలెక్షన్స్ షేర్స్ (కోట్లలో)
నైజాం 4.47
సీడెడ్ 2.61
నెల్లూరు 0.89
కృష్ణ 1.93
గుంటూరు 4.04
వైజాగ్ 2.91
ఈస్ట్ గోదావరి 3.21
వెస్ట్ గోదావరి 1.82
ఏపీ మరియు తెలంగాణ మొత్తంగా 21.88 కోట్లు