Mon Dec 23 2024 11:47:07 GMT+0000 (Coordinated Universal Time)
నల్లగొండ జిల్లాలో ర్యాగింగ్ కలకలం
సూర్యాపేట మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఒక జూనియర్ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు
సూర్యాపేట మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఒక జూనియర్ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు. విద్యార్థి బట్టలు విప్పి ఫొటోలు తీశారు. దీంతో సిగ్గుతో కుచించుకుపోయిన విద్యార్థి ఆ విషయాన్ని తమ తల్లితండ్రులకు తెలిపారు. వెంటనే తల్లిదండ్రులు డయల్ 100కు ఫోన్ చేశారు.
25 మందిపై.....
పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. మొత్తం 25 మంది సీనియర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ నిరోధక చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. కళాశాల యాజమాన్యం కూడా ర్యాగింగ్ ను సీరియస్ గా తీసుకుంది. ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్ల పై చర్యలు తీసుకోనున్నారు.
Next Story