Mon Dec 23 2024 02:42:58 GMT+0000 (Coordinated Universal Time)
ర్యాగింగ్ ఎఫెక్ట్... ఆరుగురు విద్యార్థుల సస్పెన్షన్
సూర్యాపేట మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
సూర్యాపేట మెడికల్ కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ర్యాగింగ్ కు కారణమైన ఆరుగురు విద్యార్థులను సస్పెండ్ చేస్తూ డీఎంఈ నిర్ణయం తీసుకున్నారు. 2019 - 2020 బ్యాచ్ కు చెందిన ఆరుగురు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేశారు. అంతేకాదు వీరు ఆరుగురిని హాస్టల్ నుంచి శాశ్వతంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బట్టలు విప్పి.....
రెండు రోజుల క్రితం సూర్యాపేట మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థిని సీనియర్లు ర్యాగింగ్ చేశారు. విద్యార్థి బట్టలు విప్పి ఫొటోలు తీశారు. దీనిపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దీనిపై యాజమాన్యం కూడా చర్యలు తీసుకుంది.
Next Story