Mon Dec 23 2024 04:54:23 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నల్లగొండకు ముగ్గురు మంత్రులు
తెలంగాణ మంత్రులు నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణ మంత్రులు నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారు. ముగ్గురు మంత్రులు పర్యటిస్తుండటంతో టీఆర్ఎస్ శ్రేణులు వారికి పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు.
వివిధ కార్యక్రమాల్లో....
నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీ, ఎస్టీ హాస్టల్ భవనం, ఐటీ హబ్ కార్యాలయాలకు మంత్రులు శంకుస్థాపన చేస్తారు. తరవ్ాత బీట్ మార్కెట్ లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేయనున్నారు. రైతు బజార్, బస్తీ దవాఖానాల కోసం స్థలాలను మంత్రులు పరిశీలిస్తారు. అనంతరం ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శిస్తారు. తర్వాత మున్సిపల్ అధికారులతో మంత్రులు సమీక్ష చేయనున్నారు.
Next Story