Sun Dec 22 2024 23:16:08 GMT+0000 (Coordinated Universal Time)
పెనువిషాదం.. ఏసీ పేలి ఇద్దరు మృతి
స్థానిక న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజిలో ఏపీ గ్యాస్ సిలిండర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో..
ఏసీ పేలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. నల్గొండ పట్టణంలోని బర్కత్ పుర కాలనీలో ఈ ఘటన జరిగింది. స్థానిక న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజిలో ఏపీ గ్యాస్ సిలిండర్ మార్చేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఒక్కసారిగా అది పేలిపోయింది. ఈ ప్రమాదంలో కోల్డ్ స్టోరేజి యజమాని షేక్ ఖలీమ్, అక్కడ పనిచేసే సాజిద్ మృతి చెందారు. పేలుడు ధాటికి ఇద్దరి శరీరాలు విచ్ఛిన్నమై చెల్లాచెదురుగా పడటంతో.. ఆ ప్రాంతం భయానకంగా మారింది.
కోల్డ్ స్టోరేజిలో పనిచేస్తున్న మరో నలుగురు తృటిలో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. ఏసీలు వాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని సూచించినా.. నిర్లక్ష్యంతో ఇలా ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. మంచి బ్రాండెడ్ ఏసీ కొనాలంటే ఖర్చెక్కువ అవుతుందని.. తక్కువ రకం ఏసీలు కొనడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో ప్రకాశం జిల్లాలో కూడా ఓ ఇంట్లో తల్లి, కొడుకు ఏసీ వేసుకుని నిద్రిస్తుండగా.. అది ఉన్నట్లుండి పేలడంతో తల్లి మరణించింది. కొడుకుకి తీవ్రగాయాలు అయ్యాయి.
Next Story