Sun Dec 22 2024 20:22:58 GMT+0000 (Coordinated Universal Time)
లోహిత్ ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని దల్ఖోలా – బీహార్లోని కిషన్గంజ్ మధ్య ఉన్న సూర్యకమల్..
ఒడిశాలో జరిగిన మూడు రైళ్ల ఘోర ప్రమాదం ఇంకా మరువక ముందే.. మరో ఎక్స్ ప్రెస్ కు తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఇంజిన్ నుంచి 10 బోగీలు విడిపోయి పట్టాలపై నిలిచిపోయాయి. అస్సాంలోని గౌహతి నుంచి జమ్మూ తపాయికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్లోని ఉత్తర దినాజ్పూర్ జిల్లాలోని దల్ఖోలా – బీహార్లోని కిషన్గంజ్ మధ్య ఉన్న సూర్యకమల్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఇంజిన్ నుంచి బోగీలు విడిపోవడంతో.. రైలు రెండు భాగాలుగా విడిపోయింది. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులకు భయాందోళన చెందారు. కొందరైతే రైలు నుంచి కిందికి దూకేశారు.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు.. వెంటనే ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా ప్రాంతానికి చేరుకున్న అధికారులు, సిబ్బంది.. విడిపోయిన బోగీలను తిరిగి ఇంజిన్ కు జత చేయడంతో అంతా హమ్మయ్యా.. అని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ.. గమ్యస్థానానికి 16 గంటలు ఆలస్యంగా చేరుకుంది. కప్లింగ్ వైఫల్యం కారణంగా రైలు కోచ్లు విడిపోయినట్లు సమాచారం. రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోవడంతో.. ప్రయాణికులు ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయా.. అవి వైరల్ అవుతున్నాయి.
Next Story