Sun Nov 24 2024 08:41:23 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు కూడా కేసులు అంతే
24 గంటల్లో భారత్ లో కొత్తగా 10,112 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 29 మంది కరోనాతో మరణించారు.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. భారత్లో కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో కొత్తగా 10,112 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 29 మంది కరోనాతో మరణించారు. అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే ఏడుగురు కరోనాతో మరణించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 5,31,329 మంది కరోనా కారణంగా మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
మరణాల సంఖ్య....
ప్రస్తుతం భారత్లో 67,806 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఎక్కువగా కేసులు ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలోనే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ కరోనా సోకి 4,42,92,854 మంది రికవరీ అయినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత్లో వ్యాప్తికి XBB.1.16 కోవిడ్-19 వేరియంట్ కారణమని వైద్య నిపుణులుచెబుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని, మరో రెండు వారాలు కేసుల సంఖ్య అధికంగానే ఉంటుందని పేర్కొన్నారు.
Next Story