Fri Nov 22 2024 19:25:43 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు కోవిడ్ కేసులు ఎన్నంటే?
24 గంటల్లో 11,692 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్కరోజులో 28 మంది కరోనా కారణంగా మరణించారు
భారత్ లో కరోనా కేసులు తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో భారత్లో 11,692 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఒక్కరోజులో 28 మంది కరోనా కారణంగా మరణించారని తెలిపింది. నిపుణులు చెబుతున్నట్లుగా రెండు వారాల పాటు కోవిడ్ కేసులు పెరుగుతాయన్న హెచ్చరికలు నిజమవుతున్నట్లే అనిపిస్తున్నాయి.
తగ్గని పాజిటివ్ కేసులు...
ప్రస్తుతం భారత్ లో 66,170 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. వీరంతా ఎక్కువ మంది హోం ఐసొలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారని, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రాలు కూడా కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
Next Story