Sun Dec 22 2024 11:32:15 GMT+0000 (Coordinated Universal Time)
పార్కింగ్ కారులో 12 బంగారు బిస్కెట్లు..
వాటికి సంబంధించి సదరు వ్యాపారి మోహన్ దాస్ వద్ద ఎలాంటి ధృవపత్రాలు లేవని, బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని..
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో.. ఓ యజమాని ఇంటివద్ద పార్క్ చేసి ఉన్న కారులో 12 బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. వాటి విలువ సుమారు రూ.7 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆదివారం కాన్పూర్ లో ఐటీ అధికారులు పలువురు వ్యాపారవేత్తల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేశారు. ఈ క్రమంలో ఓ బంగారు నగల వ్యాపారి ఇంటి వద్ద పార్కింగ్ లో ఉన్న కారులో మ్యాట్ కింద రూ.7 కోట్ల విలువైన 12 బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. ఒక్కో బిస్కెట్ బరువు కిలో ఉన్నట్లు తెలిపారు.
వాటికి సంబంధించి సదరు వ్యాపారి మోహన్ దాస్ వద్ద ఎలాంటి ధృవపత్రాలు లేవని, బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని ఐటీ అధికారులు వెల్లడించారు. అలాగే వ్యాపారి ఇంటిలో జరిపిన సోదాల్లో ఇంటిలో, వారి దుకాణంలో పనిచేసే వ్యక్తుల పేర్లపై కోట్ల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాల బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. పన్ను చెల్లింపుల్లో కూడా అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. సుగంధ ద్రవ్యాల వ్యాపారి పీయూష్ జైన్ నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు జరుపగా.. అక్కడ కూడా సరైన పత్రాలు లేని నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Next Story