Sun Nov 10 2024 04:10:56 GMT+0000 (Coordinated Universal Time)
స్కార్పియన్, డ్రాగన్ గుర్తులు.. 1200 కోట్ల హెరాయిన్ ను పట్టేసుకున్నారు
హెరాయిన్‌ను పాకిస్తాన్ నుండి పడవలో పంపించి, స్వాధీనం చేసుకున్న ఇరాన్ నౌకలోకి సముద్రం
1,200 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ ను భారత్ లో పట్టుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తయారైన 200 కిలోల హెరాయిన్ మొదట పాకిస్తాన్లోకి వచ్చిందని, అక్కడి నుండి ఇరాన్ పడవలో ఉంచి.. దీనిని భారతదేశం, శ్రీలంకలో విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు భారత అధికారులు తెలిపారు. పడవలోని ఆరుగురు ఇరాన్ పౌరులను అరెస్టు చేశారు. ఈ ఇరానియన్ పడవ సాయంతో డ్రగ్స్‌ను వాటర్‌ప్రూఫ్ గా తీసుకుని వస్తున్నారు. ఏడు పొరల ప్యాకేజింగ్‌లో రవాణా చేస్తూ వచ్చారు. ఇండియన్ నేవీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) గురువారం సముద్రంలో ఆపరేషన్ నిర్వహించి, ఆరుగురు ఇరాన్ పౌరులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును కేరళలోని కొచ్చికి తీసుకువచ్చినట్లు ఎన్‌సిబి సీనియర్ ఆఫర్ సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు.
ప్యాకెట్లలో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లకు సంబందించిన కార్టెల్‌లకు ప్రత్యేకమైన మార్కింగ్, ప్యాకింగ్ ప్రత్యేకతలు ఉన్నాయని అధికారి తెలిపారు. కొన్ని డ్రగ్ ప్యాకెట్లలో 'స్కార్పియన్' సీల్ గుర్తులు ఉండగా, మరికొన్ని 'డ్రాగన్' సీల్ గుర్తులను కలిగి ఉన్నాయి. హెరాయిన్‌ను పాకిస్తాన్ నుండి పడవలో పంపించి, స్వాధీనం చేసుకున్న ఇరాన్ నౌకలోకి సముద్రం మధ్యలో మార్చుకుని ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఈ నౌక శ్రీలంక నౌకకు తదుపరి డెలివరీ కోసం భారత జలాలలో నుండి వెళుతుండగా పట్టుకున్నారు. శ్రీలంక నౌకను గుర్తించి, అడ్డగించేందుకు ప్రయత్నాలు చేసినా దానిని గుర్తించలేకపోయామని అధికారులు తెలిపారు.
భారత నేవీతో కలిసి ఆపరేషన్ చేపట్టిన ఎన్సీబీ అధికారులు ఈ డ్రగ్స్ సరఫరాను పట్టుకున్నారు. ఈ మొత్తాన్ని కేరళలోని కొచ్చికి తీసుకొచ్చారు. ఆరుగురు ఇరానియన్ దేశస్థులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ మార్కెట్లో రూ.1200 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
Next Story