Mon Dec 23 2024 10:20:07 GMT+0000 (Coordinated Universal Time)
పడవ బోల్తా.. 14 మంది గల్లంతు
బార్బెండియా వంతెన సమీపంలో పడవ బోల్తా పడటంతో.. 14 మంది దామోదర్ నదిలో గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో ..
ఝార్ఖండ్ లో గురువారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బార్బెండియా వంతెన సమీపంలో పడవ బోల్తా పడటంతో.. 14 మంది దామోదర్ నదిలో గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో పడవలో 18 మంది ఉండగా..ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది సహాయంతో నలుగురు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన 14 మంది కోసం జమ్తారా జిల్లా యంత్రాంగంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నట్లు. తుఫాన్ కారణంగా ఝార్ఖండ్ లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ కారణంగానే ఈ పడవ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Also Read : ఆ ఇద్దరు మంత్రులకూ పవన్ అభిమానుల సెగ
దామోదర్ నదిలో పడవ బోల్తా ప్రమాదంపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ విచారం వ్యక్తం చేశారు. గల్లంతైన ప్రయాణికులను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయని, గల్లంతైన వారంతా సురక్షితంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఒడ్డుకు చేరిన నలుగురికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతుందని సిబ్బంది పేర్కొన్నారు.
News Summary - 14 missing as boat capsizes in Jharkhand Damodar River ; rain hampers rescue operation
Next Story