Sat Dec 28 2024 04:12:01 GMT+0000 (Coordinated Universal Time)
ఆ శిశువులకు "దానా"గా నామకరణం
ఒరిస్సా లో దానా తుపాను బీభత్సం సృష్టించింది. కానీ దానా తుపాను తీవ్రత సమయంలో రాష్ట్రంలో 1600 మంది శిశువులు జన్మించారు
ఒరిస్సా లో దానా తుపాను బీభత్సం సృష్టించింది. కానీ దానా తుపాను తీవ్రత సమయంలో రాష్ట్రంలో 1600 మంది శిశువులు జన్మించారు. వీరిలో కొందరికి దానాగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఒరిస్సా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒరిస్సా రాష్ట్రంలో దానా తుపాను ప్రభావ నేపథ్యంతో రాష్ట్రంలో శుక్రవారం మధ్యాహ్నం వరకు సుమారు ఆరు వేల మంది గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పదహారు వందల మంది శిశువులు...
వీరిని రాష్ట్రంలో ఉన్న వివిధ ఆసుపత్రులకు తరలించగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆసుపత్రిల్లో 1600 మంది శిశువులు జన్మించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వీరిలో పలువురికి ‘దానా’ అనే నామకరణం చేయగా, మరికొంత మంది ఇదే పేరును పెట్టేందుకు ఆలోచన చేస్తున్నారు. దానా పేరు పెట్టడం తమకు సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు దానా తుపాను నేపథ్యంలో 203 రైళ్లను రైల్వే వాళ్ళు రద్దు చేసిన నేపథ్యంలో్ నేడు కొన్ని మార్గాల్లో రైళ్లసేవలను తూర్పుకోస్తా రైల్వే పునః ప్రారంభించింది.
Next Story