Mon Dec 23 2024 07:02:16 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రైళ్లు ఢీ.. ఫలక్ నుమా సహా 18 రైళ్లు రద్దు
లూప్ లో ఉన్న గూడ్స్ ను కోరమాండల్ రైలు ఢీ కొట్టగా.. 10-12 భోగీలు పట్టాలు తప్పి పల్టీలు కొట్టాయి. అదే సమయంలో..
నిన్న రాత్రి ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 238 మంది మృతి చెందగా.. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. బహనాగ్ రైల్వే స్టేషన్ లో సిగ్నలింగ్ వైఫల్యం కారణంగా మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. లూప్ లో ఉన్న గూడ్స్ ను కోరమాండల్ రైలు ఢీ కొట్టగా.. 10-12 భోగీలు పట్టాలు తప్పి పల్టీలు కొట్టాయి. అదే సమయంలో వచ్చిన యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన రైలును ఢీ కొట్టింది. ఈ ప్రమాదం కారణంగా.. పలు రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా రద్దయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రద్దయిన ట్రైన్స్‌లో హౌరా-సికింద్రాబాద్(12703), షాలిమార్-హైద్రాబాద్(18045), హౌరా-తిరుపతి(20889) ఉన్నాయి.
తాత్కాలికంగా రద్దయిన రైళ్లలో హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్(12837), హౌరా-బెంగళూరు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12863), హౌరా-చెన్నై మెయిల్(12839), హౌరా-పూరీ సూపర్‌ఫాస్ట్(12895), హౌరా-సంబల్పుర్ ఎక్స్‌ప్రెస్(20831), సంత్రగాచి-పూరీ ఎక్స్‌ప్రెస్(02837) ఉన్నట్లు అధికారులు తెలిపారు. అలాగే దారి మళ్లించిన రైళ్ల వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు-గువాహటి(12509) రైలును విజయనగరం, టిట్లాగఢ్, జార్సుగుడా, టాటా మీదుగా దారి మళ్లించారు. ఇంకా ఖరగ్‌పుర్ డివిజన్లో ఉన్న చెన్నై సెంట్రల్-హౌరా(12840) రైలును జరోలి మీదుగా.. వాస్కోడగామా-షాలిమార్(18048), సికింద్రాబాద్-షాలిమార్(22850) వీకెండ్ రైళ్లను కటక్, అంగోల్ మీదుగా దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Next Story