Mon Dec 23 2024 15:19:12 GMT+0000 (Coordinated Universal Time)
సోదరుడితో గొడవ.. ఆవేశంలో సెల్ ఫోన్ మింగేసిన యువతి
దీంతో కుటుంబ సభ్యులు ఆమెను గ్వాలియర్స్లోని జయరోగ్య ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ ప్రశాంత్ శ్రీవాస్తవ, డాక్టర్ ప్రశాంత్..
సెల్ ఫోన్ విషయంలో సోదరుడితో గొడవ పడిన ఓ యువతి.. క్షణిక ఆవేశంలో ఆ సెల్ ఫోన్ ను మింగేసింది. కాసేపటికి తీవ్ర కడుపునొప్పితో వాంతులు చేసుకుంటూ.. ఆస్పత్రిలో చేరింది. వైద్యులు శస్త్ర చికిత్స చేసి యువతి పొట్టలో నుంచి సెల్ ఫోన్ ను బయటికి తీశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భిండ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అను అనే 18 ఏళ్ల యువతికి, ఆమె సోదరునికి మధ్య గొడవ జరిగింది. తీవ్ర వాగ్వాదం తర్వాత మనస్తాపానికి గురైన అను ఫోన్ ను అమాంతం మిగేసింది. కాసేపటికే తీవ్రమైన కడుపు నొప్పితో వాంతులు చేసుకుంది.
దీంతో కుటుంబ సభ్యులు ఆమెను గ్వాలియర్స్లోని జయరోగ్య ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ ప్రశాంత్ శ్రీవాస్తవ, డాక్టర్ ప్రశాంత్ పిపారియా, యూనిట్ ఇన్ఛార్జ్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నవీన్ కుష్వాహ.. యువతికి పరీక్షలు నిర్వహించారు. యువతి పొట్టలో సెల్ ఫోన్ చూసి షాకయ్యారు. అల్ట్రాసౌండ్, ఎక్స్-రే, CT స్కాన్తో సహా క్షుణ్ణంగా పరీక్షించారు. ఆ తర్వాత ఎండోస్కోపీ లేదా లాపరోస్కోపీ వంటి ఇన్వాసివ్ పద్ధతుల ద్వారా సెల్ ఫోన్ బయటకు తీయొచ్చని అంచనాకు వచ్చి.. వెంటనే ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించి యువతి కడుపులో నుంచి ఫోన్ను బయటకు తీశారు. యువతి కడుపుకి 10 కుట్లు వేశామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
Next Story