Mon Dec 23 2024 08:25:10 GMT+0000 (Coordinated Universal Time)
వాడు నా వాడు.. కాదు నా వాడు..బాయ్ ఫ్రెండ్ కోసం బస్టాండ్ లో ఫైట్
మహారాష్ట్రలోని పైఠణ్ జిల్లాలో ఇద్దరు అమ్మాయిలకు గొడవ అయింది. ఓ అమ్మాయితో కలిసి ఆ యువకుడు..
ఈ మధ్యకాలంలో చదువుకుంటున్న విద్యార్థినులు కనీస విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. గతంలో ఏపీలోని వైజాగ్, విజయవాడ నగరాల్లో బాయ్ ఫ్రెండ్ కోసం నడిరోడ్డుపై సిగ్గులేకుండా కొట్లాడుకున్న ఘటనలున్నాయి. తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో జరిగింది. ఆ ఇద్దరు అమ్మాయిలకు సుమారు 17 ఏళ్ల వయసు ఉంటుంది. ఇద్దరూ ఒకే అబ్బాయిని ప్రేమిస్తున్నారు. అతనికోసం బస్టాండ్‌లో అందరు చూస్తుండగానే.. వాడు నా వాడు.. కాదు నా వాడంటూ కొట్టుకున్నారు. వారిద్దరినీ అదుపుచేయలేక ఆ అబ్బాయి అక్కడి నుంచి పారిపోయాడు.
మహారాష్ట్రలోని పైఠణ్ జిల్లాలో ఇద్దరు అమ్మాయిలకు గొడవ అయింది. ఓ అమ్మాయితో కలిసి ఆ యువకుడు తాజాగా బస్టాండ్‌కు వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న మరో అమ్మాయి వెంటనే అక్కడకు చేరుకుంది. అతను తనకిసొంతం అంటే.. తనకే సొంతం అంటూ కొట్టుకున్నారు. గొడవ పెరిగిపోవడంతో చుట్టుపక్కల ఉన్నవారు అందరూ వారినే చూస్తూ నిలబడ్డారు. దీంతో భయపడిపోయిన ప్రియుడు ఆ అమ్మాయిల బారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. అమ్మాయిలు మాత్రం గొడవ పడుతూ అక్కడే ఉండిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు అమ్మాయిలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.
Next Story