Sat Dec 21 2024 04:52:42 GMT+0000 (Coordinated Universal Time)
ఇదేందయ్యా ఇది.. తనకన్నా 30 ఏళ్లు చిన్నదైన స్టూడెంట్ ను పెళ్లాడిన టీచర్
వివరాల్లోకి వెళ్తే.. ఆ యువతి పేరు శ్వేతా కుమారి(20). ఆ టీచర్ పేరు సంగీత్ కుమార్(50). రోస్రా వాసి శ్వేతా కుమారి..
అతనొక గౌరవమైన వృత్తిలో ఉన్నాడు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ టీచర్.. సమాజం విస్తుపోయే పనిచేశాడు. తన దగ్గర కోచింగ్ కోసం వచ్చే స్టూడెంట్ నే ఆ టీచర్ పెళ్లాడాడు. ఇలాంటివి ఎన్నిచూడలేదనుకుంటే పొరపాటే. తమకన్నా 10-15 చిన్నవాళ్లైన స్టూడెంట్స్ ని పెళ్లాడిన ఘటనలున్నాయి కానీ.. ఇక్కడ ఆ స్టూడెంట్ కి - టీచర్ కి ఏకంగా 30 ఏళ్ల వయసు తేడా ఉంది. అతని వయసు 50, ఆమె వయసు 20సంవత్సరాలు. ఈ విచిత్రమైన ప్రేమ పెళ్లి బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆ యువతి పేరు శ్వేతా కుమారి(20). ఆ టీచర్ పేరు సంగీత్ కుమార్(50). రోస్రా వాసి శ్వేతా కుమారి.. ఇంగ్లీష్ నేర్చుకునేందుకు టీచర్ దగ్గరికి వచ్చేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ లవ్ లో పడ్డారు. మనసులు ఒక్కటయ్యాయి. ఇంకేముంది పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు. టీచర్ సంగతి అటుంచితే.. తనకన్నా 30 ఏళ్లు పెద్దవాడైన టీచర్ ను ఆ యువతి ప్రేమించి, పెళ్లిచేసుకోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.
ఓ మంచి రోజు చూసుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. రోస్రా బజార్ లోని ఓ గుడిలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటూ.. టీచర్ తో ఆ స్టూడెంట్ మూడు ముళ్లు వేయించుకుంది. ఈ పెళ్లికి కొంతమంది సన్నిహితులు కూడా హాజరయ్యారండోయ్. వారంతా ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. టీచర్, స్టూడెంట్ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇంగ్లీష్ టీచర్ కు ఇంతవరకూ పెళ్లి కాలేదా అంటే.. అయింది. కానీ భార్య కొన్నేళ్ల క్రితమే చనిపోయింది. అప్పటి నుంచి ఆయన ఒంటరిగా ఉంటున్నారు. రెండో పెళ్లి కూడా చేసుకోలేదు.
- Tags
- bihar
- viral video
Next Story