Sun Dec 14 2025 23:24:01 GMT+0000 (Coordinated Universal Time)
అది.. ఆటోనా బస్సా.. ఏకంగా 27 మంది..!
వృద్ధులు, పిల్లలతో సహా 26 మంది ప్రయాణీకులను ఆ ఆటో డ్రైవర్ తీసుకెళ్తున్నట్లు గుర్తించారు పోలీసులు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లాలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిని కిందకు దిగమని చెప్పగా.. ఏకంగా 27 మంది ఒకరి తర్వాత మరొకరు కిందకు దిగారు. ఒక్క అంగుళం కూడా వదలకుండా లోపల ఇరుక్కుపోయి కూర్చున్నారు. పోలీసులు ప్రయాణికులను కిందకు దిగమని చెప్పడం ప్రారంభించగా.. పోలీసులు వారిని ఒక్కొక్కరిగా లెక్కించడం ప్రారంభించారు. అందులో నుండి దిగుతున్న వారిని చూసి ఆశ్చర్యపోయారు. ఫతేపూర్‌లోని బింద్కీ కొత్వాలి ప్రాంతంలో ఈ ఆటో కనిపించింది. ఆటోలో మహా అయితే ఆరుగురు వెళ్లొచ్చు. కానీ ఆ డ్రైవర్ వృద్ధులు, పిల్లలతో సహా 27 మందిని అందులో ఎక్కించాడు.
వృద్ధులు, పిల్లలతో సహా 26 మంది ప్రయాణీకులను ఆ ఆటో డ్రైవర్ తీసుకెళ్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఓవర్ స్పీడ్ లో వెళుతోంది ఆ ఆటో. ఛేజ్ చేసి ఆపిన ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారులు ఆశ్చర్యపోయారు. పోలీసులు ప్రయాణికులను ఒక్కొక్కరుగా లెక్కిస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఫతేపూర్‌లోని బింద్కీ కొత్వాలి ప్రాంతంలో పోలీసులు ఓవర్ స్పీడ్ తో ఆటో వెళుతోందని గమనించారు. అతివేగంతో వెళ్తున్న ఆటోను పోలీసులు వెంబడించారు. అధికారులు ప్రయాణికులను కిందకు దిగమని చెప్పగా.. ఆటోలో నుండి డ్రైవర్‌తో సహా 27 మంది వ్యక్తులు కిందకు దిగారు.
https://twitter.com/AshwiniUpadhyay/status/1546288565792808960
News Summary - 27 Passengers Found Traveling in An Over-Speeding Auto, UP Police Stunned
Next Story

