Fri Nov 22 2024 17:54:00 GMT+0000 (Coordinated Universal Time)
కశ్మీర్: ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు
జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు కాగా, ఆ తర్వాత వారు మరణించినట్టు ఆర్మీ తెలిపింది. మరణించించిన సిబ్బంది చేతిలో ఉన్న నాలుగు ఏకే-47 రైఫిళ్లను ఓ ఉగ్రవాది లాక్కెళ్లాడు. ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ ప్రారంభమైనట్టు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన జవాన్లు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్టు వివరించారు.
కుల్గాంలోని హలాన్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో బలగాలను పసిగట్టిన ఉగ్రవాదులకు కాల్పులకు తెగబడ్డారని కశ్మీర్ పోలీసు విభాగం తెలిపింది. భద్రతా బలగాలు సైతం కాల్పులు ప్రారంభించగా.. ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని. హుటాహుటిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మరణించారు. ఆ ప్రాంతంలో ఇంకా భద్రతా బలగాల ఆపరేషన్ జరుగుతూ ఉంది. మరింత సమాచారం అందాల్సి ఉంది.
Next Story