Thu Dec 26 2024 16:16:56 GMT+0000 (Coordinated Universal Time)
పట్టాలు తప్పిన సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్ ప్రెస్
సికింద్రాబాద్ నుండి షాలిమార్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు
నవంబర్ 9న శనివారం సికింద్రాబాద్ నుండి షాలిమార్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. సౌత్ ఈస్టర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఓంప్రకాష్ చరణ్ నల్పూర్ స్టేషన్ సమీపంలో బి1, మరో రెండు కోచ్ లు పట్టాలు తప్పినట్లు ధృవీకరించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో రెండు కోచ్ లు పక్కకు ఓరిగాయి. ఈ ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కోల్కతాకు 40 కిలోమీటర్ల దూరంలోని నల్పూర్లో ఈ వీక్లీ స్పెషల్ రైలు పట్టాలు తప్పింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా పెద్ద గాయాలు సంభవించలేదు. "ఈరోజు ఉదయం 5.31 గంటలకు ఖరగ్పూర్ డివిజన్లోని నల్పూర్ స్టేషన్ గుండా వెళుతుండగా 22850 సికింద్రాబాద్-షాలిమార్ వీక్లీ ఎక్స్ప్రెస్ పార్శిల్ వ్యాన్, రెండు కోచ్లు పట్టాలు తప్పాయి. ఎవరికీ పెద్దగా గాయాలవ్వలేదు, ప్రాణనష్టం జరగలేదు" అని సౌత్ ఈస్టర్న్ రైల్వే తెలిపింది. రైలు మధ్య నుంచి బయటి పట్టాలపైకి మారుతున్న సమయంలో పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు.
Next Story