Wed Apr 09 2025 04:00:25 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ, మొహాలీల్లో కుప్పకూలిన భవనాలు

ఢిల్లీలోని లాహోరీ గేట్ ప్రాంతంలో భవనం కూలిన ఘటనలో నాలుగేళ్ల చిన్నారితో సహా ముగ్గురు మృతి చెందగా, నలుగురు శిథిలాల కింద ఇరుక్కుపోయారు. వర్షం కురుస్తూనే ఉండడంతో భవనం కుప్పకూలిందని సాయంత్రం 7:30 గంటలకు తమకు ఫోన్ వచ్చిందని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఓల్డ్ ఢిల్లీ ప్రాంతంలో ఉన్న భవనానికి ఐదు అగ్నిమాపక వాహనాలను పంపించారు. ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.
మొహాలీ: ఆదివారం సాయంత్రం 5.15 గంటలకు ఏరోసిటీలోని మొహాలి సిటీ సెంటర్-2 కు సంబంధించిన మాల్ ప్రహరీ గోడ కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను బీహార్‌కు చెందిన రవీందర్ సాహి (28), శంకర్ మాఝీ (30)గా గుర్తించారు. గాయపడిన ఆజాద్‌ను ఫేజ్-6లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, మొహిందర్‌ను ఫేజ్-6లోని సివిల్ ఆసుపత్రిలో చేర్చారు. మరో కూలీ తృటిలో తప్పించుకున్నారు గోడ కూలడం చూసి మరో కూలీ అవతలి వైపు దూకాడు. డీఎస్పీ (సిటీ 2) హర్సిమ్రాన్ సింగ్ బాల్ సహా సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక దళం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. "సాయంత్రం 5.20 గంటలకు సంఘటన గురించి మాకు సమాచారం అందింది, మేము సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను బయటకు తీశాము." అని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు.
Next Story