Mon Dec 23 2024 12:19:19 GMT+0000 (Coordinated Universal Time)
జమ్మూ-కశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఈ కాల్పుల్లో ఒక గ్రెనేడ్ కూడా పేలినట్లు సైన్యం తెలిపింది. కాగా.. కాల్పుల సమయంలో ట్రక్కు డ్రైవర్ పరారవ్వగా..ముగ్గురు..
జమ్మూ-కశ్మీర్ లో బుధవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూలోని పజ్తీర్థి-సిధ్రా రోడ్డులో ఉదయం 7.30 గంటల సమయంలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు సైన్యం వెల్లడించింది. భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్ హైవేపై ట్రక్కులో వెళ్తున్న ఉగ్రవాదులను భద్రతా దళం గుర్తించి.. ట్రక్కును చుట్టుముట్టి కాల్పులు జరిపింది. వెంటనే తీవ్రవాదులు సైన్యంపై ఎదురు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఒక గ్రెనేడ్ కూడా పేలినట్లు సైన్యం తెలిపింది. కాగా.. కాల్పుల సమయంలో ట్రక్కు డ్రైవర్ పరారవ్వగా..ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. వీరంతా భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి రహదారిని మూసివేసి అధికారులు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మంగళవారం అదే ప్రాంతంలో పోలీసులు భారీమొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉదంపూర్ ప్రాంతంలో 15 కేజీల పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిని నిర్వీర్యం చేశారు.
Next Story