Tue Nov 26 2024 00:19:36 GMT+0000 (Coordinated Universal Time)
IAS coaching centre: బేస్ మెంట్ లో ఐఏఎస్ కోచింగ్.. ప్రాణాలు తీసిన వరద నీరు
కోచింగ్ సెంటర్ భవనం బేస్ మెంట్ లోకి వరదలు రావడంతో
శనివారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయితే కోచింగ్ సెంటర్ భవనం బేస్ మెంట్ లోకి వరదలు రావడంతో సివిల్ సర్వీస్ కు ప్రిపేర్ అవుతున్న ముగ్గురు మరణించారు. ఓల్డ్ రాజిందర్ నగర్ ప్రాంతంలోని రావు ఐఏఎస్ స్టడీ సర్కిల్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ (సెంట్రల్ ఢిల్లీ) ఎం హర్షవర్ధన్ ధృవీకరించారు. క్రిమినల్ కేసు నమోదు చేశాం.. మా ఫోరెన్సిక్ బృందాలు సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నాయి. దీనిపై సరైన విచారణ జరుగుతోంది.. కేసు నమోదు చేసి నిజానిజాలు తేలుస్తామని పోలీసులు తెలిపారు.
ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారులు సాయంత్రం 7 గంటలకు కోచింగ్ సెంటర్లోని నేలమాళిగలో వరదలు నీరు వచ్చాయని తమకు కాల్ వచ్చిందని వార్తా సంస్థ పిటిఐకి ధృవీకరించారు. కొంతమంది చిక్కుకున్న అవకాశం ఉందని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పారని.. బేస్మెంట్ మొత్తం ఎలా నీటమునిగిందని ఆరా తీస్తున్నామని అన్నారు. బేస్మెంట్లోకి అతివేగంగా వరదనీరు వచ్చి చేరిందని, దీంతో కొంత మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారన్నారు. తాము వెళ్లే సమయానికి నేలమాళిగలో వరద నీరు వచ్చిందని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందం సెర్చ్ ఆపరేషన్ తర్వాత విద్యార్థుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
Next Story