Mon Dec 23 2024 19:56:00 GMT+0000 (Coordinated Universal Time)
ముంబైలో మరో 30 మంది వైద్యులకు కరోనా
నిన్న ముంబైలోని జేజే ఆస్పత్రిలో 61 మంది రెసిడెంట్ వైద్యులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా.. సియోన్ ఆస్పత్రిలో పనిచేస్తోన్న మరో 30 మంది
భారత్ లో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువవ్వగా.. బాధితులకు చికిత్స చేయాల్సిన వైద్యులు కూడా మహమ్మారి బారిన పడుతున్నారు. నిన్న ముంబైలోని జేజే ఆస్పత్రిలో 61 మంది రెసిడెంట్ వైద్యులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా.. సియోన్ ఆస్పత్రిలో పనిచేస్తోన్న మరో 30 మంది వైద్యులకు కూడా కోవిడ్ పాజిటివ్ గా తేలింది. దీంతో ముంబైలో ఇప్పటి వరకూ వైరస్ బారిన పడిన రెసిడెంట్ వైద్యుల సంఖ్య 260కి చేరినట్లు మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది.
Also Read : భారీ అగ్నిప్రమాదం.. 58 షాపులు దగ్ధం
నాలుగు రోజుల వ్యవధిలోనే ఇంతభారీ మొత్తంలో వైద్యులు కరోనా బారిన పడటం ముంబైలో కలకలం రేపుతోంది. ఒకవైపు కరోనా.. మరోవైపు ఒమిక్రాన్ విజృంభిస్తున్న తరుణంలో.. వైద్యులు కూడా కరోనా బారిన పడటం ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్రలోనూ రోజువారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైరస్ వ్యాప్తి దృష్ట్యా అక్కడ పలు ఆంక్షలు అమలు చేసినప్పటికీ.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం దడ పుట్టిస్తోంది.
Next Story