Mon Dec 23 2024 05:18:04 GMT+0000 (Coordinated Universal Time)
జమ్మూ కశ్మీర్ లో విషాదం.. నలుగురు జవాన్లు సజీవదహనం
పిడుగుపాటు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లోనూ ఇండియన్ ఆర్మీ ట్రక్కు ..
జమ్మూకాశ్మీర్ లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు జవాన్లు సజీవదహనమయ్యారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అమర జవాన్లకు సంతాపం తెలుపుతున్నారు. జమ్ము-పూంఛ్ రహదారిపై భారత ఆర్మీకి చెందిన ఓ వాహనం వెళ్తోంది.
ఈ క్రమంలో అక్కడ ఒక్కసారిగా వాహనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు భారత జవాన్లు అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు. అయితే.. పిడుగుపాటు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లోనూ ఇండియన్ ఆర్మీ ట్రక్కు ఇలాంటి ప్రమాదమే జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఆర్మీ వెహికిల్‌లో టెక్నికల్ ఫెయిల్యూర్ తలెత్తింది. ఉదయ్‌పూర్‌లోని మిలిటరీ స్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం తలెత్తింది. అంతకు ముందు 2021లో ఆర్మీ వెహికిల్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Next Story