Fri Nov 22 2024 14:34:26 GMT+0000 (Coordinated Universal Time)
జమ్మూ కశ్మీర్ లో తీవ్రవాదుల మరో ఘాతుకం
సోమవారం మధ్యాహ్నం జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు
సోమవారం మధ్యాహ్నం జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు ఆర్మీ ట్రక్కుపై దాడి చేయడంతో నలుగురు సైనికులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన ఆరుగురు సైనికులను సైనిక ఆసుపత్రికి తరలించారు. బిల్లవార్ తహసీల్లోని లోయి మల్హర్లోని బద్నోటా గ్రామంలో మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ గ్రామం కథువా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి 120కిమీ దూరంలో ఉంది.
“సోమవారం మధ్యాహ్నం బిల్లవార్లోని లోయి మల్హర్ ప్రాంతంలోని బద్నోటా గ్రామంలో ఆర్మీ ట్రక్కుపై సాయుధ ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఉగ్రవాదులు తొలుత గ్రెనేడ్తో దాడి చేసి ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపారు. ఆకస్మిక దాడిలో నలుగురు సైనికులు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు” అని పేరు ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిపై సైన్యం ఇంకా ప్రకటన విడుదల చేయలేదు.
అంతకుముందు.. పోలీసులు విడుదల చేసిన ఒక ప్రకటనలో, “కతువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో ఉగ్రవాదులు.. భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఇద్దరు ఆర్మీ సిబ్బందికి గాయాలయ్యాయి.. భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు." అని తెలిపారు.
Next Story