Mon Dec 23 2024 04:30:42 GMT+0000 (Coordinated Universal Time)
లైంగిక సామర్థ్యం కోసం రెండు వయాగ్రా ట్యాబ్లెట్లు.. వ్యక్తి మృతి
ఆపై తనతో వచ్చిన మహిళతో హోటల్ లోని రూమ్ లో ఏకాంతంగా గడిపాడు. మరుసటి రోజున ఉదయం అతను తీవ్ర అస్వస్థతకు ..
ఇటీవల కాలంలో తినే ఆహార లోపమో, జనరేషన్ లోపమో, చేసే పని లోపమో గానీ.. మనుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. కృత్రిమంగా లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చాలా మంది మందులు వేసుకోక తప్పని పరిస్థితి. అలా ఓ వ్యక్తి రెండు వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకున్నాడు. మరుసటి రోజు ఆరోగ్యం క్షీణించి మరణించాడు. అయితే అతను ఆ ట్యాబ్లెట్లు వేసుకున్నందుకే చనిపోయాడా అంటే.. దానికన్నా ముందు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మెడిసిన్ జర్నల్ ప్రచురించింది. వైద్యుల సలహా, సూచన లేనిదే వయాగ్రా ట్యాబ్లెట్లు వాడొద్దని హెచ్చరించింది.
వివరాల్లోకి వెళ్తే.. నాగ్ పూర్ లోని ఓ హోటల్ లో వ్యక్తి మద్యం సేవించాక రెండు వయాగ్రా ట్యాబ్లెట్లు తీసుకున్నాడు. ఆపై తనతో వచ్చిన మహిళతో హోటల్ లోని రూమ్ లో ఏకాంతంగా గడిపాడు. మరుసటి రోజున ఉదయం అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విపరీతంగా వాంతులు అవ్వడంతో అతనితో ఉన్న మహిళ హోటల్ సిబ్బంది సహాయం కోరింది. తనకేం ఫర్వాలేదని, గతంలోనూ ఇలానే అయిందని కాసేపటికి అంతీ సర్దుకుంటుందన్నాడు. కానీ.. పరిస్థితి ఇంకా దిగజారడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తిని పరిశీలించిన వైద్యులు అతను అప్పటికే మరణించాడని తెలిపారు.
సదరు వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించగా.. రక్తం గడ్డకట్టడం వల్లే ఆ వ్యక్తి చనిపోయినట్లు తేలింది. ఆల్కహాల్ తో పాటు వయాగ్రా తీసుకోవడం, గతంలో రక్తపోటు ఉండడమే ఆయన మరణానికి దారితీసిందని వెల్లడైంది. వైద్యుల సలహా లేనిదే వయాగ్రా వంటి వాటిని తీసుకోవడం వల్ల ప్రాణాపాయం ఉండొచ్చని చెప్పేందుకే ఈ కేసును ప్రచురించినట్లు జర్నల్ ఆఫ్ ఫోరెన్సిక్ అండ్ లీగల్ మెడిసిన్ పేర్కొంది.
Next Story