Sat Nov 23 2024 02:24:02 GMT+0000 (Coordinated Universal Time)
అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.9గా నమోదు
అరుణాచల్ ప్రదేశ్ లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని బాసర్ లో తెల్లవారుజామున
అరుణాచల్ ప్రదేశ్ లో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని బాసర్ లో తెల్లవారుజామున 4.29 గంటలకు భూకంపం వచ్చింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.9 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్ సీఎస్) పేర్కొంది. బాసర్ కు ఉత్తర వాయువ్యదిశలో 148 కిలోమీటర్ల దూరంలో.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
Also Read : మద్యం ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
కాగా.. తెల్లవారుజామున భూమి కంపించడంతో.. నిద్రలో ఉన్న స్థానికులు ఉన్నట్లుండి ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యారు. గతేడాది అక్టోబర్ 2వ తేదీన పాంగిన్ లోనూ భూకంపం సంభవించింది. అక్టోబర్ 2న 4.1, అక్టోబర్ 3న బాసర్ లో 4.4, అక్టోబర్ 5న మరోసారి పాంగిన్ లోనే 4.5 తీవ్రతతో వరుస భూకంపాలు సంభవించాయి.
Next Story