Sun Mar 30 2025 13:34:46 GMT+0000 (Coordinated Universal Time)
Road Accident: ఒకే కుటుంబంలోని 8 మంది దుర్మరణం
జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని దక్సుమ్ ప్రాంతంలో

జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని దక్సుమ్ ప్రాంతంలో వాహనం లోయలో పడడంతో ఇద్దరు మైనర్లతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది వ్యక్తులు మరణించారు. బాధితుల్లో ఓ వ్యక్తి, ఇద్దరు మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారని తేలింది. వారు కిష్త్వార్ నుంచి వస్తున్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ కుటుంబం ప్రయాణిస్తున్న టాటా సుమో వాహనం దక్సుమ్ సమీపంలో అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
రాజౌరి, రియాసి జిల్లాల్లో వరుసగా రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించిన కొద్ది రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. జూలై 21న తాండికస్సీ నుండి లామ్ మార్గంలో ఎనిమిది మందితో వెళ్తున్న టాక్సీ రాజౌరిలోని చలాన్ గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. జులై 13న జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 25 మంది గాయపడ్డారు.
Next Story