Mon Dec 23 2024 08:05:07 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో పాము
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నివాసంలో పాము టెన్షన్ పెట్టింది. ఐదు అడుగుల చెకర్డ్ కీల్‌బ్యాక్ కనిపించింది. దీన్ని సాధారణంగా ఏషియాటిక్ వాటర్ స్నేక్ అని పిలుస్తారు. భద్రతా సిబ్బంది గార్డు గదికి సమీపంలో ఈ పామును చూసారు. అయితే ఈ పాము విషపూరితమైనది కాదని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పామును చూసి, వన్యప్రాణుల రక్షణ, పరిరక్షణ కోసం పనిచేస్తున్న NGO కి సమాచారం అందించారు. ఎన్జీవోకు చెందిన ఇద్దరు సభ్యుల బృందం పామును రక్షించింది.
"గురువారం ఉదయం, న్యూఢిల్లీలోని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బంగ్లా ఆవరణలో చెకర్డ్ కీల్‌బ్యాక్ పాముని భద్రతా సిబ్బంది చూసారు. గార్డు గదికి సమీపంలో పాము కనిపించడంతో, వారు వెంటనే హెల్ప్‌లైన్ నంబర్ ను సంప్రదించారు. ఆ బృందం రెస్క్యూ పరికరాలతో సన్నద్ధమయ్యారు, ఇద్దరు సభ్యుల రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుంది. ఇంతలో, గార్డు గది చుట్టూ ఉన్న చెక్క పలకల మధ్యలో పాము ప్రవేశించింది. వన్యప్రాణుల సంరక్షణ బృందం పామును పట్టుకుంది అని" అని వైల్డ్ లైఫ్ SOS తెలిపింది. చెకర్డ్ కీల్‌బ్యాక్ పాములు ప్రధానంగా సరస్సులు, నదులు, చెరువులు, కాలువలు, వ్యవసాయ భూములు, బావులు మొదలైన నీటి వనరులలో కనిపిస్థాయి. ఈ జాతులు వన్యప్రాణి (రక్షణ) చట్టం, 1972 యొక్క షెడ్యూల్ II ప్రకారం రక్షించబడింది. పాములు కనిపించగానే కొట్టి చంపేస్తూ ఉన్నారని.. అలా చేయకుండా పట్టేసి.. ఇతర ప్రాంతాల్లో వదలడం చాలా మంచిదని వన్యప్రాణి సంరక్షకులు తెలిపారు.
Next Story