Tue Nov 05 2024 10:47:30 GMT+0000 (Coordinated Universal Time)
అండమాన్లో భారీ భూకంపం
అండమాన్ నికోబార్ దీవులను మరోసారి భూకంపం వణికించింది.
అండమాన్ నికోబార్ దీవులను మరోసారి భూకంపం వణికించింది. పోర్ట్ బ్లెయిర్ కు సమీపంలో ఈ భూమి కంపించింది. అర్ధరాత్రి 12.53 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదయింది. భూకంప కేంద్రం పోర్ట్ బ్లెయిర్ కు ఆగ్నేయ దిశలో 126 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూ ఉపరితలానికి 69 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని తెలిపింది.
అర్ధరాత్రి 12.53 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదయింది. భూకంప కేంద్రం పోర్ట్ బ్లెయిర్ కు ఆగ్నేయ దిశలో 126 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. భూ ఉపరితలానికి 69 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
Next Story