Mon Dec 23 2024 19:07:26 GMT+0000 (Coordinated Universal Time)
బాత్ రూమ్ కు వెళితే బుస్.. బుస్ అంటూ సౌండ్స్.. తీరా చూస్తే..!
అంతకు ముందు ఆ ఇంట్లో ఉన్న వాళ్లు బాత్ రూమ్ కు వెళ్ళినప్పుడు బుస్.. బుస్ అనే సౌండ్స్ వినేవారట..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్నగర్ జిల్లాలో ఓ ఇంటిని పాములు ఏకంగా నివాసం చేసుకున్నాయి. ఓ ఇంట్లోని బాత్రూమ్లో 60 పాములు, 75 గుడ్ల పెంకులు కనిపించాయి. ఈ వార్త స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది. పాములు పట్టేవారిని రంగంలోకి దించి గంటల తరబడి శ్రమించి పాములను పట్టుకుని అడవుల్లోకి వదిలారు. ఈ ఇల్లు జిల్లాలోని ఖతౌలీ తహసీల్లో ఉంది. ఇది రంజిత్ సింగ్కు చెందినప్పటికీ.. చాలా కాలం క్రితం నుండి అద్దెకు ఇచ్చారు.
అంతకు ముందు ఆ ఇంట్లో ఉన్న వాళ్లు బాత్ రూమ్ కు వెళ్ళినప్పుడు బుస్.. బుస్ అనే సౌండ్స్ వినేవారట.. ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడైతే బుధవారం బాత్రూమ్లోంచి పాములు బయటకు రావడంతో అందరూ షాకయ్యారు. ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. సహాయం కోసం పాములను పట్టేవారిని పిలవాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత, బాత్రూమ్ ఫ్లోర్ కింద 60 పాములు, సుమారు 75 గుడ్డు పెంకులు కనిపించాయి. పాములను గుర్తించిన ఇంటి వద్ద చాలా ధూళి ఉందని స్థానికులు తెలిపారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్లే ఇంత పెద్ద సంఖ్యలో పాములు అక్కడి నుంచి బయటికి వచ్చాయని చెప్పారు. బాత్రూమ్లో దాదాపు 60 పాములు బయటపడ్డాయి. గంటల తరబడి శ్రమించి పట్టేశారు. ఆ తర్వాత అడవిలోకి వాటిని వదిలిపెట్టారు. ఆ ప్రాంతంలో మరిన్ని పాములు ఉండే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Next Story